AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Srikalahasti CI Slaps : శ్రీకాళహస్తి సీఐ అంజుయాదవ్‌కు హెచ్‌ఆర్సీ నోటీసులు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్‌

సంఘటనా స్థలంలో సీఐ దురుసు ప్రవర్తనను వీడియో తీస్తున్న వ్యక్తిపై కూడా ఆమె దాడికి పాల్పడ్డారు. ఫోన్ లాక్కునే ప్రయత్నం చేశారు. సీఐ ప్రవర్తన చర్చనీయాంశమైంది. జనసేన నేతపై సీఐ దాడి చేసిన వీడియో వైరల్‌గా మారింది.

Srikalahasti CI Slaps : శ్రీకాళహస్తి సీఐ అంజుయాదవ్‌కు హెచ్‌ఆర్సీ నోటీసులు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్‌
Ci Anju Yadav
J Y Nagi Reddy
| Edited By: Narender Vaitla|

Updated on: Jul 15, 2023 | 3:02 PM

Share

శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్‌కి APHRC నోటీసులు జారీ చేసింది. 3 రోజుల క్రితం జనసేన కార్యకర్తను కొట్టిన అంజూయాదవ్‌తో సహా స్టేషన్‌ ఆఫీసర్‌, తిరుపతి డిఎస్పి, తిరుపతి ఎస్పీ, అనంతపురం డిఐజి, తిరుపతి కలెక్టర్, డీజీపీ, హోం సెక్రటరీ, చీఫ్ సెక్రటరీలకు హెచ్‌ఆర్సీ నోటీసులు జారీ చేసింది. విచారణ జరిపి ఈనెల 27న నివేదిక సమర్పించాలని, శ్రీకాళహస్తి సిఐ, తిరుపతి డిఎస్పి,ఎస్పి లకు ఆదేశాలు జారీ చేసింది హెచ్ఆర్సీ.

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై సీఎం జగన్ వ్యాఖ్యలకు నిరసనగా ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. ఈ నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. ఈ క్రమంలోనే ఆందోళన చేస్తున్న జనసేన నేతలపై చెంపదెబ్బలతో విరుచుకుపడ్డారు అంజు యాదవ్‌. జనసేన కార్యకర్త సాయి పై సీఐ అంజు యాదవ్ చేయి చేసుకోవడంపై స్పందించిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ విచారణకు ఆదేశించింది.

ఇవి కూడా చదవండి

సంఘటనా స్థలంలో సీఐ దురుసు ప్రవర్తనను వీడియో తీస్తున్న వ్యక్తిపై కూడా ఆమె దాడికి పాల్పడ్డారు. ఫోన్ లాక్కునే ప్రయత్నం చేశారు. సీఐ ప్రవర్తన చర్చనీయాంశమైంది. జనసేన నేతపై సీఐ దాడి చేసిన వీడియో వైరల్‌గా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం  క్లిక్ చేయండి..