‘రాకెట్‌ ఉమెన్‌’ చేతిలో చంద్రయాన్‌-3 మిషన్‌.. ఇంతకీ ఎవరీ డా.రీతూ కరిధాల్‌..

చిన్నప్పటి నుండి చంద్రుడు, నక్షత్రాలపై ఆసక్తి కనబరుస్తూ వచ్చారు డాక్టర్‌ రీతు కరిధాల్. 1975లో లక్నోలోని ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు.. బాల్యం నుండి, ఆమె చంద్రుడు-నక్షత్రాలు, ఆకాశంపై ఆసక్తి కలిగి ఉండేది. ఇస్రో, నాసాకు సంబంధించిన వార్తాపత్రిక కథనాలు, సమాచారం, ఫోటోలను సేకరించడం రీతు హాబీ.

'రాకెట్‌ ఉమెన్‌' చేతిలో చంద్రయాన్‌-3 మిషన్‌.. ఇంతకీ ఎవరీ డా.రీతూ కరిధాల్‌..
Ritu Karidhal
Follow us

|

Updated on: Jul 14, 2023 | 12:50 PM

ఈ రోజు భారతదేశానికి చాలా ప్రత్యేకమైన రోజు. జులై 14 శుక్రవారం చంద్రయాన్ -3 చంద్రుని దక్షిణ ధ్రువం ఉపరితలంపైకి బయల్దేరింది. యావత్ ప్రపంచ వైజ్ఞానిక సమాజం దృష్టి ఇప్పుడు మన చంద్రయాన్‌-3పైనే కేంద్రీకృతమై ఉంది. ఇది మన దేశానికి మరింత ప్రత్యేకమైనది. ఎందుకంటే చంద్రయాన్-3 శ్రీహరికోట నుండి భారతదేశపు ‘రాకెట్ మహిళ’గా పిలువబడే లక్నో మహిళ డాక్టర్ రీతు కరిధాల్ ఆధ్వర్యంలో అంతరిక్షానికి బయలుదేరింది.

ఈసారి చంద్రయాన్-3ని ల్యాండింగ్ చేసే బాధ్యతను సీనియర్ మహిళా శాస్త్రవేత్త డాక్టర్ రీతుకు అప్పగించారు. ఈ మేరకు రీతు చంద్రయాన్-3 మిషన్ డైరెక్టర్ అని ఇస్రో ప్రకటించింది. ప్రచార ప్రాజెక్ట్ డైరెక్టర్ పి.వీర ముత్తువేల్. దీనికి ముందు డాక్టర్ రీతు మంగళయాన్‌కు డిప్యూటీ ఆపరేషన్స్ డైరెక్టర్‌గా, చంద్రయాన్-2లో మిషన్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఈసారి చంద్రయాన్-3లో ఆర్బిటర్ లేదు. కానీ, ప్రొపల్షన్ మాడ్యూల్, కమ్యూనికేషన్ శాటిలైట్ లాగా పని చేస్తుంది.

చిన్నప్పటి నుండి చంద్రుడు, నక్షత్రాలపై ఆసక్తి కనబరుస్తూ వచ్చారు డాక్టర్‌ రీతు కరిధాల్. 1975లో లక్నోలోని ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు.. బాల్యం నుండి, ఆమె చంద్రుడు-నక్షత్రాలు, ఆకాశంపై ఆసక్తి కలిగి ఉండేది. ఇస్రో, నాసాకు సంబంధించిన వార్తాపత్రిక కథనాలు, సమాచారం, ఫోటోలను సేకరించడం రీతు హాబీ. ఆమె లక్నో విశ్వవిద్యాలయం నుండి భౌతికశాస్త్రంలో తన Sc, MSc పూర్తి చేసింది. ఆ తర్వాత ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసేందుకు బెంగళూరులోని IIScలో చేరారు. డాక్టర్ కరిధాల్ ISROలో నవంబర్ 1997 నుండి ఇంజనీర్‌గా వీధులు నిర్వహిస్తున్నారు. బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఇస్రో చేప‌ట్టిన ఎన్నో మిష‌న్స్‌లో రీతు ముఖ్య‌భూమిక పోషించారు.. చాలా మిష‌న్స్‌కు ఆప‌రేష‌న్స్ డైరెక్ట‌ర్‌గా బాధ్య‌తాయుత‌మైన పోస్టు నిర్వ‌ర్తించారు.

ఇవి కూడా చదవండి

రాకెట్ వుమెన్ ఆఫ్ ఇండియాగా డాక్టర్ రీతు కరిధాల్‌ని పిలుస్తారు. జాతీయ‌, అంతర్జాతీయ ప‌బ్లికేష‌న్స్‌లో దాదాపు 20కిపైగా పేప‌ర్స్ రాశారు. యంగ్ సైంటిస్ట్ అవార్డు, ఇస్రో టీమ్ అవార్డు, ఏఎస్ఐ టీమ్ అవార్డు, సొసైటీ ఆఫ్ ఇండియా ఏరోస్పేస్ టెక్నాల‌జీ అవార్డుల‌ను సొంతం చేసుకున్నారు రీతు. ఇప్పుడు చంద్ర‌యాన్‌-3 మిష‌న్ డైరెక్ట‌ర్‌గా రీతూ మ‌రో రికార్డ్‌ క్రియేట్‌ చేయనున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..