AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాపం.. బట్టతల బయటపడకుండా విగ్గుతో వచ్చిన నిత్య పెళ్లికొడుకు.. నిజం తెలిసిన పెళ్లి కూతురు ఏం చేసిందంటే..

పైగా పెట్టుడు జుట్టు కావటంతో పెళ్లి కూతురు కోపం మరింత కట్టలు తెంచుకుంది. పెళ్లికి వచ్చిన అందరి ముందే.. అతన్ని పట్టుకుని దుమ్ముదులిపేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నవ వరుడి వేషంలో ఉన్న ఓ వ్యక్తి చుట్టుపక్కల వారికి క్షమాపణలు చెబుతున్నట్లు ఈ వీడియోలో కనిపిస్తోంది. కానీ, అతన్ని ఎవరూ క్షమించలేదు.

పాపం.. బట్టతల బయటపడకుండా విగ్గుతో వచ్చిన నిత్య పెళ్లికొడుకు.. నిజం తెలిసిన పెళ్లి కూతురు ఏం చేసిందంటే..
Wearing Wig
Jyothi Gadda
|

Updated on: Jul 14, 2023 | 11:02 AM

Share

ఇటీవల చాలా పెళ్లి వీడియోలు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. కొందరు వేర్వేరు వివాహాల వల్ల, మరికొందరు వివాదాల కారణంగా పెళ్లిళ్లు వార్తల్లోకెక్కుతున్నాయి. కొన్నిసార్లు కట్నం కారణంగా వివాహం విచ్ఛిన్నం కావడం, కట్నం డిమాండ్ చేసిన వరుడు, అతని కుటుంబ సభ్యులకు గుణపాఠం నేర్పించిన వీడియోలు కూడా అనేకం చూశాం. ఇప్పుడు ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కారణం ఏమిటంటే, ఇక్కడ వరుడు నకిలీ జుట్టుతో రెండో పెళ్లికి సిద్ధపడ్డాడు. కానీ, అసలు విషయం వెలుగులోకి రావడంతో నవ వరుడికి దేహశుద్ధి చేశారు వధువు, ఆమె బంధువులు.

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఒక పెళ్లికొడుకు విగ్గు ధరించి పెళ్లి చేసుకోవడానికి మండపానికి చేరుకున్నాడు. అయితే ఎలాగోలా అతనికి గతంలోనే వివాహమైందని తెలిసింది. ఇప్పుడు రెండో పెళ్లి చేసుకోవడానికి వచ్చాడని తెలిసి వధువు, ఆమె కుటుంబ సభ్యులు ఆగ్రహంతో ఊగిపోయారు. దాంతో అతడి విగ్గు బాగోతం కూడా బయటపడింది. ఇంకేముంది.. అసలే రెండో పెళ్లికి సిద్ధపడ్డాడు.. పైగా పెట్టుడు జుట్టు కావటంతో పెళ్లి కూతురు కోపం మరింత కట్టలు తెంచుకుంది. పెళ్లికి వచ్చిన అందరి ముందే.. అతన్ని పట్టుకుని దుమ్ముదులిపేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నవ వరుడి వేషంలో ఉన్న ఓ వ్యక్తి చుట్టుపక్కల వారికి క్షమాపణలు చెబుతున్నట్లు ఈ వీడియోలో కనిపిస్తోంది. కానీ, అతన్ని ఎవరూ క్షమించలేదు. పెళ్లికి ముందే వరుడి రహస్యం బయటపడటంతో మోసం చేసిన పెళ్లికొడుకును వధువు కుటుంబీకులు, బంధువులు చితకొట్టారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో బీహార్‌లోని గయా గ్రామానికి చెందినదిగా తెలిసింది. పెళ్లికి ముందు, వధువు కుటుంబానికి కాస్త ఆలస్యంగా తెలిసింది.. వరుడికి తలపై వెంట్రుకలు లేవని, పైగా రెండవ వివాహం చేసుకుంటున్నాడని తెలిసింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..