AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మ కొట్టిందని ఆత్మహత్య చేసుకున్న కొడుకు.. చెల్లి పెళ్లికి ఇలా చేయాలంటూ లేఖ..

గురువారం జరిగిన ఈ దారుణ ఘటనను శుక్రవారం వెలుగులోకి వచ్చింది. గ్రామ సమీప అటవీ ప్రాంతలంలో దినేష్‌ మృతదేహం లభ్యం కాగా, పోస్టుమార్టం నిమిత్తం తరలించారు పోలీసులు. సూసైడ్‌కు ముందు షేర్‌ చేసిన వీడియో ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Suicide
Jyothi Gadda
|

Updated on: Jul 14, 2023 | 9:34 AM

Share

రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. అమ్మ కొట్టిందని 17ఏళ్ల యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చేతికందిన కొడుకు అకాల మరణంతో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. తల్లిదండ్రులు, బంధువుల రోధనలతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కోనరావుపేట మండలం వట్టిమల్ల గ్రామంలో చోటు చేసుకుంది ఈ విషాద సంఘటన.

కోనరావుపేట గ్రామంలోని తండాకు చెందిన రాజు-జ్యోతి దంపతుల కుమారుడు దినేష్ (17) అమ్మ కొట్టిందని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. అమ్మ కొట్టిందని, సూసైడ్ చేసుకుంటున్నానని ఓ వీడియోను రికార్డ్‌ చేశాడు. దాన్ని తన తోటి స్నేహితులకు పంపించాడు. అనంతరం అటవీ ప్రాంతంలోకి వెళ్లి ఉరివేసుకున్నాడు దినేష్. వీడియోలో అమ్మ, చెల్లి జాగ్రత్త అంటూ చెప్పాడు. చెల్లి పెళ్లికి తన ఫోటో ముందు పెట్టి పెళ్లి చేయాలని కోరాడు.

గురువారం జరిగిన ఈ దారుణ ఘటనను శుక్రవారం వెలుగులోకి వచ్చింది. గ్రామ సమీప అటవీ ప్రాంతలంలో దినేష్‌ మృతదేహం లభ్యం కాగా, పోస్టుమార్టం నిమిత్తం తరలించారు పోలీసులు. సూసైడ్‌కు ముందు షేర్‌ చేసిన వీడియో ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో

అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా

కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..

థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో

సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం

2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు

19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా

సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే

పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..

రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!