Telangana Politics: ఆ ఎమ్మెల్యేపై తిరుగుబాటు నటనా..? ఆగ్రహమా..? స్వంత పార్టీ నాయకుల రహస్య భేటీల వెనుక రహాస్యం ఇదేనా..

Mahabubabad: నేను కనుసైగ చేస్తే వేరేలా ఉంటది.. ఇలాంటి డైలాగ్స్ అప్పుడప్పుడు ఎమ్మెల్యే శంకర్ నాయక్ నోటివెంట వింటుంటాం... కానీ ఇప్పుడు ఆయన నోటి వెంట మాటరావడం లేదు... కానీ స్వంత పార్టీలో తిరుగుబాటు నేతల గళం మాత్రం పెరిగింది... ఈ ఎమ్మెల్యే మాకొద్దంటూ తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు.. రోజుకో అసమ్మతి నేతలు సమావేశమై మానుకోటలో హీట్ రగిలిస్తున్నారు.. అసలేం జరిగింది..?

Telangana Politics: ఆ ఎమ్మెల్యేపై తిరుగుబాటు నటనా..? ఆగ్రహమా..? స్వంత పార్టీ నాయకుల రహస్య భేటీల వెనుక రహాస్యం ఇదేనా..
Mahabubabad BRS
Follow us
G Peddeesh Kumar

| Edited By: Sanjay Kasula

Updated on: Jul 14, 2023 | 9:39 AM

మహబూబాబాద్, జూలై 14: నా రూటే సపరేటు.. నేను కనుసైగ చేస్తే వేరేలా ఉంటది.. ఇలాంటి డైలాగ్స్ అప్పుడప్పుడు ఎమ్మెల్యే శంకర్ నాయక్ నోటివెంట వింటుంటాం… కానీ ఇప్పుడు ఆయన నోటి వెంట మాటరావడం లేదు… కానీ స్వంత పార్టీలో తిరుగుబాటు నేతల గళం మాత్రం పెరిగింది… ఈ ఎమ్మెల్యే మాకొద్దంటూ తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు.. రోజుకో అసమ్మతి నేతలు సమావేశమై మానుకోటలో హీట్ రగిలిస్తున్నారు.. అసలేం జరిగింది..? శంకరన్న స్వంత పార్టీలో ఎందుకంత వ్యతిరేకత..మంత్రి కేటీఆర్ మహబూబాబాద్ పర్యటన తర్వాత స్టానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై తీవ్రస్థాయిలో తిరుగుబాటు మొదలైంది.. స్వంతపార్టీ నాయకులే ఆయనపై తిరుగుబావుట ఎగురవేస్తున్నారు.. ఈ ఎమ్మెల్యే మాకొద్దు.. అభ్యర్థిని మారిస్తేనే ముద్దు.. అనే నినాదంతో అసమ్మతి సెగలు రగిలిస్తున్నారు. ద్వితీయశ్రేణి క్యాడర్ అంతా రహస్య సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఎమ్మెల్యే మార్పు కోసం డిమాండ్ చేస్తున్నారు.. వచ్చే ఎన్నికల్లో అభ్యర్థిని మారిస్తేనే తాము పార్టీకి సహకరిస్తాం.. లేదంటే గులాబీ కండువా కప్పుకున్నా మాకు నచ్చిన వారికి సహకరిస్తామని తీర్మానాలు చేసి పార్టీ అధిష్టానానికి పంపుతున్నారు.

మూడురోజుల మహబూబాబాద్ శివారులోని ఓ మామిడి తోటలో బీఆర్‌ఎస్‌ కౌనిలర్లు, ముఖ్యనాయకులు సమావేశమయ్యారు.. శంకర్ నాయక్ కు టిక్కెట్ ఇస్తే తాము సహకరించమని మూకుమ్మడిగా ప్రకటించారు. వాళ్ళను లైట్ తీసుకున్న శంకర్ నాయక్.. ఇలాంటివారు కామన్ వారి విజ్ఞతకే వదిలేస్తున్నా అని ప్రకటించి చేతులు దులుపుకొన్నారు. మహబూబాబాద్ లో రాజుకున్న అసమ్మతి సెగలు ఇప్పుడు అన్ని మండలాలకు విస్తరిస్తుంది..నిన్న కేసముధ్రం మండలానికి చెందిన బీఆర్‌ఎస్‌ నాయకులు రహస్య సమావేశం ఏర్పాటు చేశారు.. కేసముధ్రం మాజీ సర్పంచ్ నివాసంలో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కీలక భేటీ అయ్యారు. ఆయన్ను రెండు పర్యాయాలు ఎమ్మెల్యేను చేస్తే తమను పట్టించుకోకపోగా, నోటి దురుసుతో మాపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని ఆవేదన వ్యక్తంచేశారు.. ఎమ్మెల్యే శంకర్ నాయక్ టిక్కెట్ ఇస్తే తాము సహకరించే ప్రసక్తేలేదని తీర్మానం చేసి పార్టీ అధిష్టానానికి పంపారు

శంకర్ నాయక్ పై స్వంతపార్టీలో ఇంత పెద్దయెత్తున జరుగుతున్న తిరుగుబాటు ఆసక్తికర చర్చగా మారింది… ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేయిస్తున్నారా..? లేక కార్యకర్తలు, నాయకులే కడుపు మండి రోడ్డెక్కుతున్నారా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే, శంకర్ నాయక్ వర్గీయులు మాత్రం ఇదంతా ఎమ్మెల్సీ తక్కళ్ళపల్లి రవీందర్ రావు ఆడిస్తున్న మైండ్ గేమ్ అని ఆరోపిస్తున్నారు.. శంకర్ నాయక్ కు టిక్కెట్ రాకుండా కుట్రలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు.. ఏది ఏమైనా మహబూబాబాద్ బీఆర్‌ఎస్‌లో ముదిరిన ముసలం… శంకరన్న దూకుడు… ఓరుగల్లు రాజకీయ ముఖచిత్రంలో హాట్ హాట్ చర్చగా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం