కర్నూలు వైసీపీలో వర్గపోరు.. మంత్రి రోజా పర్యటనకు ముందు మరోసారి బయటపడ్డ గ్రూప్‌వార్
ఇప్పుడు రోజా వస్తున్నప్పుడూ అదే ఫ్లెక్స్ వార్ కనిపిస్తోంది. నియోజకవర్గంలో హవా చూపిస్తున్న బైరెడ్డి వల్ల వరుస అవమానాలు ఎదురవుతున్నాయన్నది ఆర్థర్ భావన. అందుకే ఇవాళ రోజాతో పాటు పాల్గొనాల్సిన కార్యక్రమాలకు కూడా ఆయన దూరంగా ఉంటారంటూ ప్రచారం జరుగుతోంది.
కర్నూలు జిల్లా నందికొట్కూరులో బైరెడ్డి సిద్దార్థరెడ్డి Vs ఎమ్మెల్యే ఆర్థర్‌గా రాజకీయ వార్ నడుస్తోంది. మంత్రి రోజా పర్యటనకు ముందు మరోసారి గ్రూప్‌వార్ బయటపడింది. మంత్రికి స్వాగతం పలికే ఫ్లెక్సీల్లో ఆర్థర్ పేరు, ఫోటో కనిపించకపోవటంతో వివాదం మొదలైంది. దీంతో ఇవాళ్టి అధికారిక కార్యక్రమాలకు ఎమ్మెల్యే ఆర్థర్ దూరంగా ఉంటున్నారు. గతంలోనూ ఇరిగేషన్ మంత్రి వచ్చినప్పుడు సేమ్ సీన్ కనిపించింది. తనకు అన్ని అవమానాలే జరుగుతున్నాయని సన్నిహితుల వద్ద ఆర్థర్ ఆవేదన వ్యక్తం చేశారు.
గత కొంతకాలంగా ఎమ్మెల్యే ఆర్థర్‌కి, శాప్ చైర్మన్‌గా ఉన్న భైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డికి అసలు గిట్టడం లేదు. ఎన్నో రోజులుగా ఇద్దరి మధ్య వర్గ విభేదాలు కొనసాగుతున్నాయి. మంత్రులు, ముఖ్యనేతలు నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఆ విభేదాలు రోడ్డెక్కుతున్నాయి. గతంలో అనిల్ కుమార్ యాదవ్ నీటిపారుదల శాఖకు మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇదే తరహా ఘటన జరిగింది. ఇప్పుడు రోజా వస్తున్నప్పుడూ అదే ఫ్లెక్స్ వార్ కనిపిస్తోంది. నియోజకవర్గంలో హవా చూపిస్తున్న బైరెడ్డి వల్ల వరుస అవమానాలు ఎదురవుతున్నాయన్నది ఆర్థర్ భావన. అందుకే ఇవాళ రోజాతో పాటు పాల్గొనాల్సిన కార్యక్రమాలకు కూడా ఆయన దూరంగా ఉంటారంటూ ప్రచారం జరుగుతోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..