Andhra pradesh: ఏపీలో ఊపందుకున్న వర్షాలు.. మరో మూడు రోజులపాటు వర్ష సూచన

ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు ఊపందుకున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఆవర్తన ప్రభావంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మాత్రం చినుకు జాడ కోసం రైతన్నలు ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఏపీలో మరో రెండు, మూడు రోజులు వర్షాలు కొనసాగుతాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. బంగాళాఖాతంలో ఎల్లుండి..

Andhra pradesh: ఏపీలో ఊపందుకున్న వర్షాలు.. మరో మూడు రోజులపాటు వర్ష సూచన
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానులకు వాతావరణ శాఖ ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రానున్న 24 గంటల్లో వాయువ్య పశ్చిమ బంగాళాఖాతం ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 15, 2023 | 9:14 AM

ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు ఊపందుకున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఆవర్తన ప్రభావంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మాత్రం చినుకు జాడ కోసం రైతన్నలు ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఏపీలో మరో రెండు, మూడు రోజులు వర్షాలు కొనసాగుతాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. బంగాళాఖాతంలో ఎల్లుండి మరో ఆవర్తనం.. 17, 18 తేదీల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ వర్షాలు నెలాఖరు వరకు కొనసాగే అవకాశం ఉన్నట్లు చెప్తున్నారు వాతావరణశాఖ అధికారులు.

నైరుతి రుతుపవనాల కారణంగా కోస్తాతో పాటు సీమలో పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. ప్రధానంగా.. ఉత్తరాంధ్రలో రెండు, మూడు రోజులుగా వానలు దంచికొడుతున్నాయి. ఏలూరు జిల్లా ఏజెన్సీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో.. వాగులు, వంకలు పొంగుతున్నాయి. కామవరం దగ్గర గుబ్బల మంగమ్మ గుడి రహదారి మూసివేశారు అధికారులు. ఉత్తర కోస్తా, యానాంలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే సీమలో కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు, మరికొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం ఉన్న క్రమంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు అధికారులు హెచ్చరించారు.

అయితే.. ఏపీలోని కొన్ని జిల్లాల్లో మాత్రం నైరుతి రుతుపవనాలు మందగించాయి. చినుకు జాడ కోసం రైతన్నలు ఆశగా ఎదురు చూసే పరిస్థితులు ఏర్పడ్డాయి. దాంతో.. వర్షాలు కురవాలంటూ జనం పూజలు చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో గ్రామ దేవతలకు పూజలు చేశారు. బాజా భజంత్రీలతో జలాభిషేకాలు నిర్వహించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?