Telangana: ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు శుభవార్త.. ఇకపై వైద్య సేవల పరిమితి పెంపు.. త్వరలోనే డిజిటల్ కార్డులు..
Telangana: ఆరోగ్య శ్రీ కార్డ్‌లో ట్రీట్మెంట్ పరిమితి 2లక్షల నుంచి 5లక్షలకు పెంచుతూ తెలంగాణ వైద్య ఆరోగ్య నిర్ణయం తీసుకుంది. సీఎం ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. దీనికి సంబంధించిన కొత్త కార్డులను త్వరలో ఇవ్వనున్నట్టు ఆయన తెలిపారు.
Telangana: అర్హులైన పేదలకు మంచి వైద్యం అందించాలనే కాన్సెప్ట్‌తో వచ్చిన ఆరోగ్య శ్రీ సేవలు ఎంతో మంది పేదలకు మంచి వైద్యంతో పాటు వారి కుటుంబాలలో ఆనందాన్ని నింపాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తరవాత వైద్యంపై మరింత దృష్టి పెట్టిన కేసీఆర్ సర్కార్ ఎప్పటికప్పుడు పేదవాడికి అవసరం అయ్యే నిర్ణయాలు తీసుకుంటుంది. ఇందులో భాగంగానే ఇప్పుడు ఆరోగ్య శ్రీ పథకం ద్వారా లబ్దిపోందే వారి కోసం వైద్య సేవల పరిమితిని 2 లక్షల నుండి 5లక్షలకు పెంచింది.
ఇందుకు సంబంధించిన ప్రక్రియను కూడా మొదలు పెట్టాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు. ఈ ఆరోగ్య శ్రీ సేవల కోసం కొత్తగా డిజిటల్ కార్డ్ లని ఇవ్వనుంది హెల్త్ డిపార్ట్మెంట్. దీనికోసం ఈ kyc నీ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సూచన చేశారు మంత్రి. ఆరోగ్య శ్రీ సేవల లో బేమెట్రిక్ విధానం లో కొంత ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో ఫేస్ రికాగ్నైజేషన్ విధానం తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది వైద్య ఆరోగ్య శాఖ.
సీఎం శ్రీ కేసీఆర్ ఆదేశాల మేరకు ఆరోగ్యశ్రీ సేవల పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంపు… కొత్త ఆరోగ్యశ్రీ డిజిటల్ కార్డులను రూపొందించి, స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా జిల్లాల్లోని లబ్ధిదారులకు అందించాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం. pic.twitter.com/3dUUrSSzPv
— BRS Party (@BRSparty) July 19, 2023
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..