తెలంగాణలో మిస్ యూస్ అవుతున్న గన్మెన్ల వ్యవస్థ.. మొన్న పైలెట్ రోహిత్ రెడ్డి నేడు చికోటి ప్రవీణ్..!

Telangana: రాష్ట్రంలో ప్రైవేటు గన్మెన్ల వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది.. చాలాకాలంగా ప్రవేటు సెక్యూరిటీ గార్డ్స్ ప్రైవేటు గన్మెన్ల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారిపోయింది ..ఇప్పుడు తాజాగా చికోటి ప్రవీణ్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత మరోసారి ప్రైవేట్ గన్మెన్ల పాత్రపైన..

తెలంగాణలో మిస్ యూస్ అవుతున్న గన్మెన్ల వ్యవస్థ.. మొన్న పైలెట్ రోహిత్ రెడ్డి నేడు చికోటి ప్రవీణ్..!
Gunmen Being Misused
Follow us
Vijay Saatha

| Edited By: శివలీల గోపి తుల్వా

Updated on: Jul 17, 2023 | 1:47 PM

Telangana: రాష్ట్రంలో ప్రైవేటు గన్మెన్ల వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది.. చాలాకాలంగా ప్రవేటు సెక్యూరిటీ గార్డ్స్ ప్రైవేటు గన్మెన్ల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారిపోయింది ..ఇప్పుడు తాజాగా చికోటి ప్రవీణ్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత మరోసారి ప్రైవేట్ గన్మెన్ల పాత్రపైన పోలీస్ శాఖలు తీవ్రస్థాయిలో చర్చ జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం అత్యంత సీరియస్‌గా తీసుకొని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికివై కేటగిరి భద్రతను కల్పించింది.అంతటి భద్రత కలిగిన రోహిత్ రెడ్డి సెక్యూరిటీని మిస్ యూస్ ఏ రకంగా చేశాడో మనందరికీ తెలుసు.. ఈ వార్త తెలంగాణ పోలీస్ శాఖతో పాటు తెలంగాణ ప్రభుత్వంలో కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారిపోయింది. ఫోటోషూట్ కోసం వై క్యాటగిరి సెక్యూరిటీని మిస్ యూజ్ చేయడం పట్ల బహిరంగంగానే పైలెట్‌పైన విమర్శలు వ్యక్తం అయ్యాయి.

రోహిత్ రెడ్డి సమాధానం చెప్పుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఆయన ఆన్సర్ ఎవరికీ సమర్థవంతంగా అనిపియ్యలేదు. ఒకవైపు పైలట్ రోహిత్ రెడ్డి ఇష్యూ మరవకముందే నిన్న లాల్ దర్వాజా బోనాల దగ్గర అత్యంత వివాదాస్పదితులైన చికోటి ప్రవీణ్ చేసిన హంగామా మరోసారి గన్మెన్ల వ్యవస్థ పరిస్థితి ఏ రకంగా ఉందో గుర్తు చేసింది. అమ్మవారి దర్శనానికి వచ్చిన చీకోటి ప్రవీణ్ తన ముగ్గురు ప్రైవేటు గన్మెన్లతో లోపటికి వెళ్ళేందుకు ప్రయత్నించారు. అక్కడే సిద్ధంగా ఉన్న హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ప్రవీణ్‌ను అడ్డుకోవడంతో పాటు అతని వెనకాల ఉన్నటి సెక్యూరిటీని కూడా ఆపారు.ఆ సమయంలో వాళ్ళ దగ్గర ఉన్న వెపన్స్‌ని గుర్తించిన హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ అధికారులు వెంటనే ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకొని పక్కకు వెళ్లి విచారించారు. దీంతో కొద్దిసేపు అక్కడ గందరగోళం నెలకొన్నప్పటికీ పోలీసులు మాత్రం సీరియస్‌గా ఆ ముగ్గురి దగ్గర ఉన్న వెపన్స్‌ని లాక్కొని పరిశీలించారు.

చికోటి హంగామా

అంతేక అక్కడ చికోటి ప్రవీణ్ గన్మెన్ల వ్యవహారం బయటకు వచ్చింది. ఎక్స్ సర్వీస్ మెన్‌లు, ఎక్స్ సి‌ఆర్‌పి‌ఎఫ్ కానిస్టేబుల్‌తో పాటు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్న ముగ్గురు వ్యక్తుల దగ్గర ఉన్న వెపన్స్‌కి సంబంధించిన లైసెన్సులు సరిగా లేవని గుర్తించి వారిపై కేసులు నమోదు చేశారు హైదరాబాద్ పోలీసులు.  ఈ ముగ్గురు తమ దగ్గర ఉన్న వెపన్స్‌ని వేరే పనుల కోసం పబ్లిక్‌గా థ్రెట్ ఉన్న వ్యక్తులకి సెక్యూరిటీగా వచ్చామని చెప్తున్నప్పటికీ వాళ్ల దగ్గర ఉన్న లైసెన్స్‌ల పైన పోలీసులు అనుమానాలు వ్యక్తం చేశారు. అంటే వాళ్ల దగ్గర ఉన్నటువంటి లైసెన్సు కరెక్ట్‌గా లేవు కాబట్టే వాళ్లపైన చీటింగ్‌తో పాటు సర్జరీ ఆన్సర్ కింద కేసులు పెట్టారు.

ఇవి కూడా చదవండి

‘షో కోసం సెక్యూర్టీ’

పబ్లిక్ లో షో కోసం, సొసైటీలో పేరు కోసం గన్మెన్లను వాడుకుంటున్నారు విమర్శ ఎప్పటినుంచో చాలామంది పైన ఉంది. ఇప్పుడు తాజాగా చికోటి వ్యవహారం కూడా అదే రకంగా మారింది. ఆయనకున్న సెక్యూరిటీ థ్రెట్ ఎవరికి తెలియదు కానీ ఆయన మాత్రం ముగ్గురు ప్రైవేట్ గన్మెన్లతో ఎక్కడికి వెళ్లినా హంగామా చేస్తున్నారు. దీంతో పోలీస్ శాఖ ప్రైవేట్ గన్మెన్ల వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంది. ఇష్టం వచ్చినట్టు ఇక్కడ ప్రైవేట్ గన్మెన్ల‌ను పెట్టుకొని తిరిగితే సహించబోమని హైదరాబాద్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. కేవలం హైదరాబాదులోనే కాదు, చాలామంది యూట్యూబర్లు సొసైటీలో పేరు కోసం గన్మెన్లను బౌన్సర్లను వేసుకొని తిరుగుతున్న వారిపట్ల చాలా సీరియస్‌గా చర్యలు ఉంటాయని తెలంగాణ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

వాడీవేడిగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
వాడీవేడిగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
రూ.4 కే వేడి వేడి చికెన్ బిర్యానీ.. భారీగా క్యూ.! వీడియో
రూ.4 కే వేడి వేడి చికెన్ బిర్యానీ.. భారీగా క్యూ.! వీడియో
ఆధార్‌పై బిగ్ అప్‌డేట్.! ఆధార్ అప్ డేట్ పై ఎక్స్‌లో ఉడాయ్ కీలక..
ఆధార్‌పై బిగ్ అప్‌డేట్.! ఆధార్ అప్ డేట్ పై ఎక్స్‌లో ఉడాయ్ కీలక..
అనాథలా పెరిగిన కోటీశ్వరుడు! సీన్ కట్ చేస్తే.. 26 ఏళ్లు తరువాత..
అనాథలా పెరిగిన కోటీశ్వరుడు! సీన్ కట్ చేస్తే.. 26 ఏళ్లు తరువాత..
కొండచిలువ చుట్టేయడంతో ఊపిరాడక విలవిల్లాడిన సింహం.. వీడియో.
కొండచిలువ చుట్టేయడంతో ఊపిరాడక విలవిల్లాడిన సింహం.. వీడియో.
90 లక్షల మందిని కట్టిపడేసిన గున్న ఏనుగు ప్రేమ.. వీడియో వైరల్.
90 లక్షల మందిని కట్టిపడేసిన గున్న ఏనుగు ప్రేమ.. వీడియో వైరల్.
రూ. 13 లక్షలతో సినిమా.. రూ. 1,647 కోట్లు కొల్లగొట్టింది.!
రూ. 13 లక్షలతో సినిమా.. రూ. 1,647 కోట్లు కొల్లగొట్టింది.!
స్పెర్మ్‌తో ఫేషియల్‌.! ఛీ ఛీ కాదు.. అసలు రహస్యం వేరే..!
స్పెర్మ్‌తో ఫేషియల్‌.! ఛీ ఛీ కాదు.. అసలు రహస్యం వేరే..!
హనీమూన్‌ నుండి తిరిగి వస్తుండగా విషాదం.. కొత్త జంట మృతి.!
హనీమూన్‌ నుండి తిరిగి వస్తుండగా విషాదం.. కొత్త జంట మృతి.!
చుట్టూ నీరు.. కొండ పైన స్వామి.! దర్శనం కోసం సాహసం చేయాల్సిందే.!
చుట్టూ నీరు.. కొండ పైన స్వామి.! దర్శనం కోసం సాహసం చేయాల్సిందే.!