AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TSRTC: ప్రయాణీకులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. వివరాలు ఇవిగో..

ప్రయాణికుల ఆర్ధిక భారం తగ్గించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా “పల్లెవెలుగు టౌన్ బస్ పాస్”కు శ్రీకారం చుట్టింది. మొదటగా కరీంనగర్, మహబూబ్ నగర్, నిజామాబాద్, నల్లగొండ జిల్లా కేంద్రాల్లో తిరిగే పల్లె వెలుగు బస్సుల్లో ఈ పాస్ ను అమలు చేయాలని సంస్థ నిర్ణయించింది.

TSRTC: ప్రయాణీకులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. వివరాలు ఇవిగో..
Tsrtc Bus
Ravi Kiran
|

Updated on: Jul 28, 2023 | 4:45 PM

Share

ప్రయాణికుల ఆర్ధిక భారం తగ్గించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా “పల్లెవెలుగు టౌన్ బస్ పాస్”కు శ్రీకారం చుట్టింది. మొదటగా కరీంనగర్, మహబూబ్ నగర్, నిజామాబాద్, నల్లగొండ జిల్లా కేంద్రాల్లో తిరిగే పల్లె వెలుగు బస్సుల్లో ఈ పాస్ ను అమలు చేయాలని సంస్థ నిర్ణయించింది.

ఈ టౌన్‌ పాస్ తో ప్రయాణికులు కరీంనగర్, మహబూబ్ నగర్ లో 10 కిలో మీటర్లు, నిజామాబాద్, నల్లగొండలో 5 కిలోమీటర్ల పరిధిలో అపరిమిత ప్రయాణం చేయొచ్చు. 10 కిలోమీటర్ల పరిధికి నెలకు రూ.800, 5 కిలోమీటర్ల పరిధికి రూ.500గా “పల్లె వెలుగు టౌన్ బస్ పాస్” ధరను సంస్థ ఖరారు చేసింది. ఇప్పటికే హైదరాబాద్, వరంగల్ లో జనరల్ బస్ పాస్ అందుబాటులో ఉంది. ఆ బస్ పాస్ ను జిల్లా కేంద్రాల్లోనూ అమలు చేయాలని ప్రయాణికుల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు కొత్తగా “పల్లెవెలుగు టౌన్ బస్ పాస్”ను సంస్థ తెచ్చింది.

హైదరాబాద్‌ లోని బస్‌ భవన్‌లో సోమవారం “పల్లె వెలుగు టౌన్‌ బస్‌ పాస్‌” పోస్టర్లను సంస్థ ఉన్నతాధికారులతో కలిసి టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్‌, ఐపీఎస్‌ ఆవిష్కరించారు. ఈ కొత్త టౌన్ పాస్ ఈ నెల 18 (మంగళవారం) నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుందని ఆయన తెలిపారు.

“జిల్లా కేంద్రాల్లో ఉద్యోగులు, చిరువ్యాపారులు ఎక్కువగా రాకపోకలు సాగిస్తుంటారు. వారి ఆర్థిక భారం తగ్గించేందుకు “పల్లె వెలుగు టౌన్ బస్ పాస్” ను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం అందుబాటులోకి తీసుకువచ్చింది. మొదటగా కరీంనగర్, మహబూబ్ నగర్, నిజామాబాద్, నల్లగొండ జిల్లా కేంద్రాల్లో ఈ పాస్ ను అమలు చేస్తున్నాం. ప్రయాణికుల ఫీడ్ బ్యాక్ ను బట్టి మరిన్ని ప్రాంతాలకు పల్లె వెలుగు టౌన్ బస్ పాస్ ను విస్తరిస్తాం. వాస్తవానికి 10 కిలోమీటర్ల పరిధికి రూ.1200, 5 కిలోమీటర్ల పరిధికి రూ.800 ధర ఉండగా.. ప్రయాణికులకు ఆర్థిక భారం తగ్గించాలని ఆ బస్ పాస్ లకు సంస్థ రాయితీ కల్పించింది. 10 కిలోమీటర్ల పరిధికి రూ.800, 5 కిలో మీటర్ల పరిధికి రూ.500గా పాస్ ధరను నిర్ణయించింది. కొత్తగా తీసుకువచ్చిన ఈ పాస్ ను హైదరాబాద్, వరంగల్ లో మాదిరిగానే ప్రయాణికులు ఆదరించి.. సంస్థను ప్రోత్సహించాలి.” అని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ కోరారు.

ఈ బస్ పాస్ కు సంబంధించిన పూర్తి వివరాలకు టీఎస్‌ఆర్టీసీ కాల్‌ సెంటర్‌ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సంస్థ సీవోవో డాక్టర్‌ రవిందర్‌, జాయింట్‌ డైరెక్టర్‌ సంగ్రామ్‌ సింగ్‌ జీ పాటిల్‌, ఈడీలు మునిశేఖర్‌, కృష్ణకాంత్, పురుషోత్తం, వినోద్ కుమార్, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

Follow Us
ముంచుకొస్తున్న నైరుతి రుతుపవనాలు.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు..
ముంచుకొస్తున్న నైరుతి రుతుపవనాలు.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు..
ఒంటికి చలువ చేసే అదిరిపోయే ఈవెనింగ్ స్నాక్స్.. తోటకూర పకోడీ..
ఒంటికి చలువ చేసే అదిరిపోయే ఈవెనింగ్ స్నాక్స్.. తోటకూర పకోడీ..
మీకో సవాల్.. ఈ చిత్రంలో ఉన్న నెంబర్‌ను కనిపెడితే.. మీరే తోపులు!
మీకో సవాల్.. ఈ చిత్రంలో ఉన్న నెంబర్‌ను కనిపెడితే.. మీరే తోపులు!
బట్టల మురికి వదలట్లేదా?.. వాషింగ్ మెషీన్‌లో ఇదొక్కటి కలపండి!
బట్టల మురికి వదలట్లేదా?.. వాషింగ్ మెషీన్‌లో ఇదొక్కటి కలపండి!
మీ కెరీర్‌లో గ్రోత్ లేదా?.. మీరు చేసే ఈ చిన్న తప్పే కారణం
మీ కెరీర్‌లో గ్రోత్ లేదా?.. మీరు చేసే ఈ చిన్న తప్పే కారణం
పూజ చేస్తూ మనసు ఇతర విషయాలపైకి వెళ్తే అది పాపమా? ప్రేమానంద్ జీ...
పూజ చేస్తూ మనసు ఇతర విషయాలపైకి వెళ్తే అది పాపమా? ప్రేమానంద్ జీ...
ఒక్క మ్యాచ్ ఆడకుండా ధోనీ ఎంత జీతం తీసుకున్నాడో తెలుసా..?
ఒక్క మ్యాచ్ ఆడకుండా ధోనీ ఎంత జీతం తీసుకున్నాడో తెలుసా..?
కుళాయి నీరు కారుతున్నాయా? మీ ఇంట్లో డబ్బు ఖాళీ అవ్వడం పక్కా
కుళాయి నీరు కారుతున్నాయా? మీ ఇంట్లో డబ్బు ఖాళీ అవ్వడం పక్కా
బ్యాంకులు వరుసగా ఆరు రోజులు బంద్
బ్యాంకులు వరుసగా ఆరు రోజులు బంద్
లక్షలాది ఆధార్ వినియోగదారులకు పెద్ద ఉపశమనం.. గడువు పొడిగింపు..!
లక్షలాది ఆధార్ వినియోగదారులకు పెద్ద ఉపశమనం.. గడువు పొడిగింపు..!