AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విదేశాల్లో లక్షలు వద్దు-ఊర్లో పానీపూరి బడ్డీయే ముద్దు.. ఉద్యోగం వదిలి ఇంటికొచ్చేసిన మెరైన్ ఇంజనీర్.. ఎందుకంటే..?

Vizianagaram: విజయనగరం గంట్యాడ మండలం గింజేరు గ్రామానికి చెందిన దాసరి వేణు.. చెన్నైలో మెరైన్ ఇంజనీరింగ్ చేశాడు. సముద్రంలో వెళ్తున్న షిప్‌‌కి మార్గమధ్యలో ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వస్తే త్వరితగతిన సాల్వ్ చేయడంలో ఇతను దిట్ట. షిప్‌లో ఉండే పన్నెండు మంది ఇంజనీర్స్ టీమ్‌లో ఇతనే

విదేశాల్లో లక్షలు వద్దు-ఊర్లో పానీపూరి బడ్డీయే ముద్దు.. ఉద్యోగం వదిలి ఇంటికొచ్చేసిన మెరైన్ ఇంజనీర్.. ఎందుకంటే..?
Dasari Venu
Gamidi Koteswara Rao
| Edited By: శివలీల గోపి తుల్వా|

Updated on: Jul 20, 2023 | 11:28 AM

Share

విజయనగరం, జూలై 20: విజయనగరం గంట్యాడ మండలం గింజేరు గ్రామానికి చెందిన దాసరి వేణు.. చెన్నైలో మెరైన్ ఇంజనీరింగ్ చేశాడు. సముద్రంలో వెళ్తున్న షిప్‌‌కి మార్గమధ్యలో ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వస్తే త్వరితగతిన సాల్వ్ చేయడంలో ఇతను దిట్ట. షిప్‌లో ఉండే పన్నెండు మంది ఇంజనీర్స్ టీమ్‌లో ఇతనే టాపర్. ఎలాంటి టెక్నికల్ ఇష్యూ అయినా ఇట్టే పట్టేయగల నేర్పరి. ఈతని ప్రతిభను గుర్తించి ఇంజనీరింగ్ పూర్తవ్వగానే దుబాయ్‌కి చెందిన ఓ మెరైన్ కంపెనీ ఉద్యోగం ఇచ్చింది. జీతం కూడా రూ. 80 వేలు. తాపీ మేస్త్రిగా పనిచేస్తున్న తండ్రి కష్టాన్ని చూసిన వేణు తనకు వచ్చిన ఉద్యోగంతో ఇక కష్టాలే ఉండవని అనుకున్నాడు. తరువాత కొద్ది రోజులకు పెళ్లి కూడా చేసుకున్నాడు. అలా కొన్నాళ్ళు సంతోషంగా గడిచింది వేణు జీవితం. ఇంతలోనే ఒక రోజు తల్లికి క్యాన్సర్ అనే పిడుగు లాంటి వార్త అందింది. కిమో తప్పనిసరి అని చెప్పారు వైద్యులు.

మరో వైపు భార్య నాలుగు నెలల గర్భవతి. తన జీవితంతో ముడిపడి ఉన్న తల్లి, భార్య అలాంటి పరిస్థితుల్లో ఉండటం జీర్ణించుకోలేక పోయాడు. ఎంత జీతం వచ్చినా, ఎంత బాగ బ్రతుకుతున్నా కష్టాల్లో ఉన్న తన వారిని వదిలి ఉండటం తట్టుకోలేక పోయాడు. వెంటనే ఉద్యోగానికి రిజైన్ చేసి సొంత ఊరు వచ్చాడు వేణు. తరువాత పరిసర ప్రాంతాల్లో జాబ్ కోసం కొన్నాళ్ళు ప్రయత్నించాడు. ఎక్కడ కూడా తనకు సంభందించిన మంచి ఉద్యోగం దొరక్కపోవడంతో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో చిరు వ్యాపారం చేయాలని డిసైడ్ అయ్యాడు. అందుకు పానీపూరి బడ్డీ పెట్టుకుందామని నిర్ణయించుకున్నాడు.

అంతే..అందుకు కావల్సిన పెట్టుబడి కోసం భార్య మెడలో మంగళ సూత్రాలు తాకట్టు పెట్టి ముప్పై వేల అప్పు తెచ్చి వ్యాపారం ప్రారంభించాడు. పగలు అంతా పానీపూరి, చాట్ కి కావలసిన ఆహారం తయారు చేసుకొని సాయంత్రం బడ్డీ పెట్టుకొని అమ్ముకుంటాడు వేణు. అతనికి పానిపూరీ వ్యాపారంలో భార్య కూడా సహకరిస్తుంది. ఒకప్పుడు దర్జాగా, లగ్జరీగా తిరిగిన వేణు పానీపూరి అమ్ముకుంటుంటే తోటి స్నేహితులు అవమానకరంగా మాట్లాడుతుంటారు. ఇదేం కర్మరా నీకు అంటూ హేళన చేస్తారు. అయినా వారి మాటలు పట్టించుకోకుండా తన పనిలో నిజాయితీ ఉంది, ఎవరేమనుకుంటే నాకెందుకు నా పని నాదే అంటూ సొంత ఊరులో అందరి మధ్య హ్యాపీ లైఫ్ సాగిస్తున్నాడు వేణు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..