AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP RGUKT IIIT Counselling 2023: నేటి నుంచి ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాల కౌన్సెలింగ్‌ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్ ఇదే

రాష్ట్రంలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీల్లో 2023-29 విద్యాసంవత్సారానికి సంబంధించి ఆరేళ్ల బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నేటి నుంచి కౌన్సెలింగ్‌ జరగనుంది. జులై 20 నుంచి 25 వరకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నట్లు..

AP RGUKT IIIT Counselling 2023: నేటి నుంచి ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాల కౌన్సెలింగ్‌ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్ ఇదే
AP RGUKT
Srilakshmi C
|

Updated on: Jul 20, 2023 | 1:04 PM

Share

అమరావతి, జులై 20: రాష్ట్రంలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీల్లో 2023-29 విద్యాసంవత్సారానికి సంబంధించి ఆరేళ్ల బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నేటి నుంచి కౌన్సెలింగ్‌ జరగనుంది. జులై 20 నుంచి 25 వరకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నట్లు అడ్మిషన్ల కన్వీనర్‌ ఆచార్య ఎస్‌ఎస్‌ఎస్‌వీ గోపాలరాజు బుధవారం (జులై 19) ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని రాజీవ్‌ గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని నాలుగు ట్రిపుల్‌ ఐటీల్లో కలిపి మొత్తం 4,400 సీట్లు ఉన్నాయి. ప్రత్యేక కేటగిరీ సీట్లు మినహాయించి మిగిలిన 4,040 సీట్లకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఈ నెల 13న ప్రకటించిన సంగతి తెలిసిందే. వీరందరికీ నేటి నుంచి కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు.

కౌన్సెలింగ్‌ తేదీలివే..

  • నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో జులై 20, 21వ తేదీల్లో
  • ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీలో జులై 21, 22వ తేదీల్లో,
  • శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీలో జులై 24, 25వ తేదీల్లో,
  • ఒంగోలు ట్రిపుల్‌ ఐటీ ప్రవేశాలకు ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీ క్యాంపస్‌లో జులై 24, 25 తేదీల్లో

ఆయా తేదీల్లో విద్యార్ధులు ఉదయం 8 గంటలకు ఆయ సెంటర్లకు హాజరు కావాలని ఆయన సూచించారు. పదో తరగతికి సంబంధించి అన్ని రకాల ఒరిజినల్‌ సర్టిఫికెట్లను వెంట తెచ్చుకోవాలని తెలిపారు. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం సీటును కేటాయిస్తారు. అడ్మిషన్‌ ఫీజు ఇతర ఫీజులు కలిపి ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.3,700, ఇతర కేటగిరీల విద్యార్థులు రూ.4,200 చొప్పున చెల్లించాల్సి ఉంటుందని కన్వినర్ గోపాలరాజు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

కుంభ రాశిలోకి కుజుడు.. లక్కూ, హ్యాపీనెస్.. ఈ రాశుల పంట పండినట్లే
కుంభ రాశిలోకి కుజుడు.. లక్కూ, హ్యాపీనెస్.. ఈ రాశుల పంట పండినట్లే
ఫ్రీగా గ్యాస్ సిలిండర్, స్టౌవ్.. మహిళలకు కేంద్రం అదిరిపోయే..
ఫ్రీగా గ్యాస్ సిలిండర్, స్టౌవ్.. మహిళలకు కేంద్రం అదిరిపోయే..
కోపం ఎక్కువగా వస్తోందా? ఇవి తింటే వెంటనే రిలాక్స్ ఐపోతారు..
కోపం ఎక్కువగా వస్తోందా? ఇవి తింటే వెంటనే రిలాక్స్ ఐపోతారు..
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. విశాఖ మెట్రోకు గ్రీన్‌సిగ్నిల్!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. విశాఖ మెట్రోకు గ్రీన్‌సిగ్నిల్!
రొమాంటిక్ సీన్లతో రెచ్చిపోయింది.. కట్ చేస్తే.. సినిమాలకు దూరం..
రొమాంటిక్ సీన్లతో రెచ్చిపోయింది.. కట్ చేస్తే.. సినిమాలకు దూరం..
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
టీ20 ప్రపంచకప్ హిస్టరీలో హ్యాట్రిక్ వీరులు.. టాప్ 5 లిస్ట్ ఇదే..
టీ20 ప్రపంచకప్ హిస్టరీలో హ్యాట్రిక్ వీరులు.. టాప్ 5 లిస్ట్ ఇదే..
తోటకూర చికెన్ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలకుండా తింటారు!
తోటకూర చికెన్ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలకుండా తింటారు!
ఈసీ కీలక నిర్ణయం.. రాష్ట్రంలోని ఆ వార్డుకు ఎన్నిక రద్దు!
ఈసీ కీలక నిర్ణయం.. రాష్ట్రంలోని ఆ వార్డుకు ఎన్నిక రద్దు!
లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాపై కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం!
లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాపై కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం!