- Telugu News Photo Gallery Cricket photos ODI World Cup 2023 Schedule: ICC Shares Picture Of Shah Rukh Khan With ODI World Cup 2023 Trophy
ODI WC 2023: ‘కింగ్ ఖాన్ చేతిలో CWC23 ట్రోఫీ..’ నెట్టింట ఫ్యాన్స్ రచ్చ
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ఓడీఐ ప్రపంచ కప్ ట్రోఫీతో ఉన్న ఫొటోను ఐసీసీ (ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్) తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. దీంతో అదికాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది..
Updated on: Jul 20, 2023 | 10:51 AM

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ఓడీఐ ప్రపంచ కప్ ట్రోఫీతో ఉన్న ఫొటోను ఐసీసీ (ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్) తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. దీంతో అదికాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

'కింగ్ ఖాన్ చేతిలో CWC23 ట్రోఫీ ...' అనే క్యాప్షన్‌తో ఈ ఫొటోను అభిమానుతో పంచుకుంది. దీంతో షారుక్ అభిమానులతోపాటు క్రికెట్ ఫ్యాన్స్ తెగ సంబర పడిపోతున్నారు.

కాగా ఓడీఐ వరల్డ్ కప్ 2023కు భారత్ అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఓడీఐ వరల్డ్ కప్ పోటీలో పది జట్లు పాల్గొంటున్నాయి. టీమిండియా కెప్టెన్ సారథ్యంలో రోహిత్ శర్మ బృందం అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో తలపడనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో అక్టోబర్ 1న పాకిస్థాన్‌తో భారత్ తలపడనుంది.

టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్ ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ ఆడనున్నాయి. అక్టోబర్ 13న దక్షిణాఫ్రికాతో ఆస్ట్రేలియా తలపడనుంది. అక్టోబర్ 20న బెంగళూరులో పాకిస్తాన్- ఆస్ట్రేలియాతో తలపడుతుంది. ఆ మరుసటి రోజు ముంబైలో ఇంగ్లండ్- దక్షిణాఫ్రికాతో ఆడుతుంది.

2019లో జరిగిన ప్రపంచకప్ సెమీ-ఫైనల్ ఓటమికి న్యూజిలాండ్‌పై భారత్ ప్రతీకారం తీర్చుకోవాలని ఎదురుచూస్తోంది. ఈ రెండు జట్లు అక్టోబర్ 22న మైదానంలో తలపడనున్నాయి. ఇక నవంబర్ 4న అహ్మదాబాద్‌లో ఆస్ట్రేలియా ఇంగ్లాండ్‌తో ఆడుతుంది. ఈ మేరకు ఐసీసీ షెడ్యూల్ ఖరారు చేసింది.




