- Telugu News Photo Gallery Cricket photos Ashes 2023 England Bowler Stuart Broad enter into 600 Test Wickets club
Ashes 2023: యాషెస్‌లో అదరగొట్టిన ఇంగ్లండ్ బౌలర్.. బ్రాడ్ ఖాతాలో చేరిన స్పెషల్ రికార్డు..!
Stuart Broad: ఆసీస్ బ్యాట్స్‌మెన్ ట్రావిస్ హెడ్‌ని అవుట్ చేయడం ద్వారా బ్రాడ్ తన 600వ టెస్ట్ వికెట్‌ను పూర్తి చేశాడు. ఈ లిస్టులో ఎవరున్నారో ఇప్పుడు చూద్దాం..
Updated on: Jul 20, 2023 | 7:43 AM

ప్రస్తుతం ఇంగ్లండ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ సిరీస్ నాలుగో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ వెటరన్ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ తన కెరీర్‌లో మరో మైలురాయిని అందుకున్నాడు.

మాంచెస్టర్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాల్గవ యాషెస్ టెస్టు తొలి రోజున ఆసీస్ బ్యాట్స్‌మెన్ ట్రావిస్ హెడ్‌ని అవుట్ చేయడం ద్వారా బ్రాడ్ తన 600వ టెస్టు వికెట్‌ను పూర్తి చేసుకున్నాడు. బ్రాడ్ తన 165వ మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు.

దీంతో 37 ఏళ్ల స్టువర్ట్ బ్రాడ్ టెస్టుల్లో 600కి పైగా వికెట్లు తీసిన రెండో ఫాస్టెస్ట్ బౌలర్‌గా, ఓవరాల్‌గా ఐదో స్థానంలో నిలిచాడు. శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ 800 వికెట్లతో మొదటి స్థానంలో నిలిచాడు.

బ్రాడ్ భాగస్వామి జేమ్స్ ఆండర్సన్ ఫాస్ట్ బౌలర్లలో అత్యధిక వికెట్లు తీసిన రికార్డును కలిగి ఉన్నాడు. అండర్సన్ ఇప్పటివరకు ఆడిన 181 టెస్టు మ్యాచ్‌ల్లో 688 వికెట్లు తీశాడు.

ఇది మాత్రమే కాదు, బ్రాడ్ ఆస్ట్రేలియాపై తన 149వ టెస్ట్ వికెట్‌ని సాధించాడు. ఆసీస్‌పై అత్యధిక వికెట్లు తీసిన ఇంగ్లండ్ ప్లేయర్ ఇయాన్ బోథమ్ (148)ను అధిగమించాడు.

ఇక ఈ నాలుగో టెస్టు మ్యాచ్ గురించి చెప్పాలంటే.. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఆస్ట్రేలియా రోజు ముగిసే సమయానికి 8 వికెట్లు కోల్పోయి 299 పరుగులు చేసింది. జట్టు తరపున లాబుచానే, షాన్ మార్ష్ అర్ధ సెంచరీ ఇన్నింగ్స్ ఆడారు. అయితే మిగిలిన జట్టు పేలవమైన ప్రదర్శనను కలిగి ఉంది.

అలాగే, ఇంగ్లండ్‌లో స్పీడ్‌స్టర్ క్రిస్ వోక్స్ 4 వికెట్లు, స్టువర్ట్ బ్రాడ్ 2 వికెట్లు, మార్క్‌వుడ్, మొయిన్ అలీ చెరో వికెట్ తీశారు.




