- Telugu News Photo Gallery Cricket photos Virat Kohli hit Most international runs after 499 matches check Sachin Tendulkar and Ricky Ponting records
Virat Kohli: చరిత్ర సృష్టించనున్న విరాట్ కోహ్లీ.. పాంటింగ్, సచిన్ రికార్డులు బ్రేక్..
Virat Kohli Records: వెస్టిండీస్‌తో 2వ టెస్టు మ్యాచ్‌లో ఆడడం ద్వారా విరాట్ కోహ్లీ టీమిండియా తరపున 500 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన 4వ ఆటగాడిగా నిలిచాడు.
Updated on: Jul 20, 2023 | 7:15 AM

India vs West Indies: పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లోని క్వీన్స్ పార్క్ ఓవల్‌లో వెస్టిండీస్‌తో జరగనున్న 2వ టెస్టు మ్యాచ్ ద్వారా విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో 500 మ్యాచ్‌లను పూర్తి చేయనున్నాడు.

విశేషమేమిటంటే.. ఈ మ్యాచ్‌తో 500 మ్యాచ్‌ల తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా కింగ్ కోహ్లి ప్రపంచ రికార్డును కూడా సొంతం చేసుకుంటాడు. ఎందుకంటే 499 మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు.

విరాట్ కోహ్లీ 499 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 25,461 పరుగులు చేశాడు. 499 టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన లిస్టులో ఆస్ట్రేలియా మాజీ సారథి రికీ పాంటింగ్ రెండవ స్థానంలో నిలిచాడు.

ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 499 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌ల్లో 24,991 పరుగులు చేశాడు.

అలాగే, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 499 మ్యాచ్‌ల ద్వారా మొత్తం 24,839 పరుగులు చేశాడు. అంటే విరాట్ కోహ్లీ ఇప్పటికే ఈ ఇద్దరు ఆటగాళ్ల రికార్డులను బద్దలు కొట్టి ప్రపంచ రికార్డు సృష్టించాడు.

ఇప్పుడు విరాట్ కోహ్లీ వెస్టిండీస్‌తో జరిగే మ్యాచ్‌లో ఆడడం ద్వారా 500 అంతర్జాతీయ మ్యాచ్‌లలో అత్యధిక పరుగులు చేసిన ప్రత్యేక ప్రపంచ రికార్డును నెలకొల్పనున్నాడు.




