AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాట్సాప్ చేస్తే పోయిన, దొంగిలించిన మొబైల్ ఇలా మీ చేతుల్లో.. లేటెస్ట్ టెక్నాలజీతో సులువుగా పోలీస్ పని..

Andhra Pradesh: అందరి చేతుల్లో స్మార్ట్‌ఫోన్ కామన్‌గా మారింది.. అలా అని అన్ని స్మార్ట్‌ఫోన్‌లు ఒకటే కాదు.. కోరిన ఫీచర్స్.. బ్రాండ్ కావాలంటే కాస్ట్ ఆదిరిపోద్ది.. ఎంతైనా సరే.. కోరిన ఫీచర్స్ కావాలనుకుంటే ఈ.ఎం.ఐ తో అయినా సరే ఫోన్‌లు కొనుగోలు చేస్తున్నారు నేటి యువత.. ఇక ఇప్పట్లో కొన్ని తరహా వ్యాపారాలకు..

వాట్సాప్ చేస్తే పోయిన, దొంగిలించిన మొబైల్ ఇలా మీ చేతుల్లో.. లేటెస్ట్ టెక్నాలజీతో సులువుగా పోలీస్ పని..
Thieft Phones
Ch Murali
| Edited By: శివలీల గోపి తుల్వా|

Updated on: Jul 20, 2023 | 10:51 AM

Share

నెల్లూరు, జూలై 20: అందరి చేతుల్లో స్మార్ట్‌ఫోన్ కామన్‌గా మారింది.. అలా అని అన్ని స్మార్ట్‌ఫోన్‌లు ఒకటే కాదు.. కోరిన ఫీచర్స్.. బ్రాండ్ కావాలంటే కాస్ట్ ఆదిరిపోద్ది.. ఎంతైనా సరే.. కోరిన ఫీచర్స్ కావాలనుకుంటే ఈ.ఎం.ఐ తో అయినా సరే ఫోన్‌లు కొనుగోలు చేస్తున్నారు నేటి యువత.. ఇక ఇప్పట్లో కొన్ని తరహా వ్యాపారాలకు సైతం స్మార్ట్ ఫోన్ తప్పని సరిగా మారింది.. రోడ్డు పక్కన బండిపై వ్యాపారం చేసే వారికి కూడా డిజిటల్ చెల్లింపులు కోసం స్మార్ట్‌ఫోన్ కావాల్సిందే.. ఇంతా కష్టపడి ఫోన్ కొంటే ఎప్పుడు ఏ దొంగోడు కొట్టేస్తాడో తెలియదు.. ఏమాత్రం ఆదమర్చినా మన చేతిలో ఫోన్ దొంగ చేతుల్లోకి వెళ్లిపోతోంది.. చోరీ జరిగాక పోలీసులు ఫిర్యాదు చేసినా గతంలో రికవరీ చాన్స్ తక్కువ.. మనకు లక్కు ఉంటే తప్ప దొరికే చాన్స్ లేదు..

కానీ ఇప్పుడు అలా కాదంటున్నారు ఏపి పోలీసులు.. మొబైల్ హంట్ యాప్, అలాగే వారు కేటాయించిన నంబరుకు వాట్సాప్ చేస్తే ఇట్టే మీ స్మార్ట్ ఫోన్ పట్టేస్తామంటున్నారు.. 9154305600.. ఈ నంబర్ గుర్తుంచుకోండి.. మీ.. లేదా మీకు సంబంధించిన వారి ఫోన్ చోరీ అయ్యుంటే వాట్సాప్ చేయండి.. రిజల్ట్ మీరే చూడండి.. ఇలా మొబైల్ హంట్ ద్వారా పిర్యాదు చేసిన వారి ఫోన్లను నెల్లూరు పోలీసులు రికవరీ చేసిన సంఖ్య చూస్తే మీకే తెలుస్తుంది.. ఈ యాప్ రిజల్ట్ ఎంటనేది.. రూ.1.60 కోట్ల విలువైన 686 ఫోన్లను నెలన్నర వ్యవధిలో రికవరీ చేశారు.. దీంతో ఈ విషయం తెలిసిన ఫోన్లను పోగొట్టుకున్న వారంతా ఇపుడు మొబైల్ హంట్ జపం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి
Recovery Of Theft Phone

పోగొట్టుకున్న ఫోన్‌ని పోలీసుల నుంచి రికవరీ చేసుకుంటున్న ముబైల్ ఓనర్

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..