Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: కుక్కలకు మించిన విశ్వాసం..! పనస పండ్ల దొంగను పట్టేసిన పాము.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో..

Trending Video: సాధారణంగా ఇంటికి వచ్చే దొంగలను పట్టుకునేందుకు కుక్కలను పెంచుతుంటారు కొందరు. అందులో కొత్తగా చెప్పుకునేది ఏమీ ఉండదు. అయితే ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్న వీడియో మాత్రం వేరే లెవల్. ఎందుకంటే పనస పండ్ల కోసం చెట్టు ఎక్కిన వ్యక్తిని..

Watch Video: కుక్కలకు మించిన విశ్వాసం..! పనస పండ్ల దొంగను పట్టేసిన పాము.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో..
Shocking Video Visuals
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jul 20, 2023 | 10:09 AM

Trending Video: సాధారణంగా ఇంటికి వచ్చే దొంగలను పట్టుకునేందుకు కుక్కలను పెంచుతుంటారు కొందరు. అందులో కొత్తగా చెప్పుకునేది ఏమీ ఉండదు. అయితే ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్న వీడియో మాత్రం వేరే లెవల్. ఎందుకంటే పనస పండ్ల కోసం చెట్టు ఎక్కిన వ్యక్తిని అక్కడే పట్టేసుకుంది ఓ పాము. రెండు కాళ్లపై పాకుతూ బుసలు కొడుతున్న ఆ పాము నుంచి తప్పించుకునేందుకు సదరు వ్యక్తి ఎంత కష్టపడ్డాడో తెలిశాక ఎవరైనా పాపం అనుకోవాల్సిందే. ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండగా.. దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు.

‘పనసతోటలో పామును కాపల ఉంచిన వ్యక్తి ఎవరో కానీ అతను చాలా గొప్పవాడే’..‘అది రాట్ స్నేక్, విషం లేని పాము. నువ్వు దొంగతనం చేసేయ్ బ్రో’.. ‘దొంగను పట్టేసిన మొదటి పాము ఇదే అనుకుంటా’ అంటూ పలువురు నెటిజన్లు రాసుకొచ్చారు. rk__rofiq__official___04 అనే ఇన్‌స్టా ఖాతా నుంచి జూలై 5న షేర్ అయిన ఈ వీడియోకి ఇప్పటివరకు 67 లక్షల వీక్షణలు, 1 లక్షా 67 వేల లైకులు లభించాయి. అయితే ఈ వీడియోలోని వ్యక్తి ఆ పాము నుంచి ఎలా తప్పించుకున్నాడనేది తెలియరాలేదు.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న వీడియో..

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..