- Telugu News Photo Gallery Reasons why you should never eat Too much of Bread and Butter, check here for details
Bread-Butter: బ్రెడ్ బటర్‌ని తింటున్నారా..? ఆరోగ్యానికి ఎంత హానికరమో.. తింటే ఈ సమస్యలు ఖాయం..
Bread-Butter: చాలా మంది ఎంతో ఇష్టంగా తినే బ్రేక్‌ఫాస్ట్ ఐటమ్స్‌లో బ్రెడ్ అండ్ బటర్ చాలా ప్రముఖమైదని. బిజీబిజీ లైఫ్‌లో ఇది ఓ వరం లాంటి ఆహారం. అయితే బ్రెడ్ అండ్ బటర్‌ని కలిపి తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు కలిగే ప్రమాదం కూడా పొంచి ఉంది. అదెలా అంటే..
Updated on: Jul 19, 2023 | 3:49 PM

Bread-Butter: ప్రతి రోజూ బటర్ బ్రెడ్ తినడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు.ఎప్పుడో ఒకసారి వెన్నెను తీసుకోవడం శరీరానికి మంచిదే కానీ రోజూ తింటే ఆరోగ్యానికి హానికరంగా మారుతుంది. బ్రెడ్ పరిస్థితి కూడా అలాంటిదే.

వెన్నలోని సంతృప్త కొవ్వులు నేరుగా ధమనుల్లో పేరుకుపోయి గుండెపోటు, పక్షవాతం వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి. ఇంకా బ్రెడ్ అండ్ బటర్‌ని కలిపి తీసుకుంటే శరీర బరువు పెరగడమే కాక కొలెస్ట్రాల్ పెరిగేలా చేస్తుంది.

బ్రెండ్ అండ్ బటర్ పెరిఫెరల్ ఆర్టరీ వ్యాధి పెరిగేలా చేస్తుంది. ఇంకా చర్మంపై మొటిమలు కలుగుతాయి.

బ్రెడ్‌లో గ్లైసెమిక్ ఇండెక్స్, కొవ్వు అధికంగా ఉన్నందున కాల్చకుండా తినడం మంచిది కాదు. అలాగే ఇందులో ఈస్ట్ ఎక్కువగా ఉన్నందును గ్యాస్ట్రిక్ సమస్యల బారిన ప్రమాదం ఉంది.

వైట్ బ్రెడ్ తినడం స్థూలకాయం వచ్చే ప్రమాదం ఉంది, కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు, బొద్దుగా ఉన్నవారు బ్రెడ్‌కి దూరంగా ఉండడం మంచిది.





























