- Telugu News Photo Gallery Rishi Sunak’s Popularity Sinks to Lowest Since he becames as a Prime Minister
Rishi Sunak: యూకేలో కన్జర్వేటీవ్ పార్టీకి సవాలు.. పడిపోతున్న ప్రధాని రిషి సునాక్ గ్రాఫ్..
యూకే ప్రధాని రిషి సునాక్‌కు ఎదురుదెబ్బ తగలనున్నట్లు కనిపిస్తోంది. గత ఏడాది అక్టోబర్ నుంచి ఇప్పటివరకు చూస్తే అతని పాపులారిటీ అత్యంత కనిష్ఠ స్థాయికి పడిపోతోందని ఓ సర్వేలో తేలింది. ఈ నేపథ్యంలో ఆయన నాయకత్వంలో కన్జర్వేటివ్ పార్టీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అనేక సవాళ్లు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పింది.
Updated on: Jul 19, 2023 | 2:10 PM

యూకే ప్రధాని రిషి సునాక్‌కు ఎదురుదెబ్బ తగలనున్నట్లు కనిపిస్తోంది. గత ఏడాది అక్టోబర్ నుంచి ఇప్పటివరకు చూస్తే అతని పాపులారిటీ అత్యంత కనిష్ఠ స్థాయికి పడిపోతోందని ఓ సర్వేలో తేలింది. ఈ నేపథ్యంలో ఆయన నాయకత్వంలో కన్జర్వేటివ్ పార్టీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అనేక సవాళ్లు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పింది.

ఈ సర్వేలో 2,151 మంది బ్రిటన్ వాసుల నుంచి అభిప్రాయం సేకరించగా దాదాపు 65 శాతం మంది ప్రజలు ఆయనకు వ్యతిరేకంగా ఓటువేశారు. కేవలం 25 శాతం మంది మాత్రమే ఆయనకు అనుకూలంగా ఓటు వేసినట్లు సర్వే పేర్కొంది. దీంతో రిషి సునాక్‌పై ఉన్న సానుకుల దృక్పథం ఏకంగా 40 శాతం తగ్గింది. గత నెలతో పోలిస్తే 6 శాతం తగ్గినట్లు చెప్పింది.

బ్రిటన్‌లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం దేశంలో భారీగా ద్రవ్యోల్బణం పెరుగుతుండటంతో కన్జర్వేటివ్ పార్టీకి అతి పెద్ద సవాలు ఎదురుపడనుంది. లక్ష్యంగా పెట్టుకున్న శాతం కంటే నాలుగు రేట్లు అధికంగా ద్రవ్యోల్బణం రావడం ఆందోళనకు గురిచేస్తోంది. ఫలితంగా జీవన ఖర్చులు పెరిగి ప్రజలకు భారంగా మారాయి. వడ్డీరేట్ల పెంపు వల్ల వంటి పలు అంశాల పట్ల కూడా ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్నట్లు తెలుస్తోంది.

బోరిస్ జాన్సన్, నిగల్ ఆడమ్స్, డేవిడ్ వర్బర్టోన్ రాజీనామాలతో ఇప్పటికే ఈ స్థానాలు ఖాళీ అయ్యాయి. దీంతో ఈ మూడు స్థానాల్లో జరగనున్న ఎన్నికల్లో గెలిచేందుకు కన్జర్వేటివ్ పార్టీ అవస్థలు పడుతోంది. 2019లో జరిగిన ఎన్నికల్లో ఈ పార్టీకి అత్యధిక మెజార్టీ వచ్చింది. కానీ ఈసారి మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు.

మరోవైపు రిషి సునాక్‌పై వచ్చే వివాదలు కూడా సమస్యను పెంచుతున్నాయి. గతంలో ఆయన ఛాన్సలర్‌గా ఉన్నప్పటి నుంచి రాసిన దాన్ని చెరిపేసే విధంగా వీలున్న ‘పైలట్ వి’ పెన్నులను వాడేవారు. ప్రధాని అయ్యాకా కూడా అవే పెన్నులను అధికారిక కార్యక్రమాల్లో వాడటం విమర్శలకు దారి తీస్తున్నాయి. సునాక్ రాసిన వాటిని తుడిచే ప్రయత్నం చేయనప్పటికీ ఇక భవిష్యత్తులో కూడా ఆయన చేయరు అని వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
