- Telugu News Photo Gallery Central Government will release PM Kisan 14th installment funds on 28th July, check for full details
PM-Kisan: రైతన్నలకు శుభవార్త.. వచ్చే వారంలోనే పీఎం కిసాన్ 14వ విడత నగదు విడుదల.. పూర్తి వివరాలివే..
PM-Kisan Samman Nidhi: రైతన్నలకు ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 14వ విడత కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారుల ఖాతాల్లో నగదును జమ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు రైతన్నల ఖాతాల్లో జూలైలోనే వేయనున్నట్లు ప్రకటించింది.
Updated on: Jul 19, 2023 | 4:42 PM

PM-Kisan Samman Nidhi: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 14వ విడత కోసం ఎదురుచూస్తున్న రైతుల ఖాతాలో జూలై 28న రూ. 18 వేల కోట్ల రూపాయల వాయిదాలను పీఎం మోదీ జమ చేయవచ్చు.

రాజస్థాన్‌లోని నౌగర్‌లో జరిగే కార్యక్రమంలో ప్రధాని మోదీ దాదాపు 9 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.2000 రూపాయల చొప్పున వేయనున్నారు.

అయితే మీరు 14వ విడత కోసం ఎదురుచూస్తున్నట్లయితే తప్పనిసరిగా e-KYCని చేయాలి. లేకపోతే మీ ఖాతాల్లో పీఎం కిసాన్ నగదు జమ కాదు. అందువల్ల ఇంకా ఈ ప్రక్తియను పూర్తి చేయని రైతులు వెంటనే సమీప సీఎస్‌సీని సందర్శించి e-KYC చేయించుకోవాలి.

వ్యవసాయంతో కుటుంబాన్ని లాక్కురాలేని ఎందరో రైతులకు పీఎం కిసాన్ పథకం చేయుతనిస్తోంది.

కాగా, ఇప్పటి వరకు ప్రధాని మోదీ పీఎం కిసాన్‌ను 13 విడతలుగా విడుదల చేశారు. ఫిబ్రవరి 27న 13వ విడతగా 16 వేల కోట్లకు పైగా నిధులు విడుదల చేశారు.




