- Telugu News Photo Gallery Cinema photos Actress Samyuktha Menon Silent in Tollywood Industry telugu cinema news
Samyuktha: గోల్డెన్ బ్యూటీ స్పీడ్‌కు బ్రేకులు.. టాలీవుడ్లో సైలెంట్ అయిన సంయుక్త..
టాలీవుడ్ ఇండస్ట్రీలో గోల్డెన్ బ్యూటీగా క్రేజ్ సంపాదించుకుంది సంయుక్త. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత వరుసగా హిట్స్ అందుకుని స్టార్ డమ్ సంపాదించుకుంది. భీమ్లా నాయక్, బింబిసార, సార్, విరూపాక్ష ఇలా ఈ బ్యూటీ నటించిన నాలుగు సినిమాలు హిట్ కావడంతో సంయుక్త టాలీవుడ్ ఇండస్ట్రీలో లక్కీ హీరోయిన్ గా మారింది. కేవలం తెలుగులోనే కాదు.. మలయాళంలోనూ మెప్పించింది. ఇక విరూపాక్ష సినిమాలో సంయుక్త నటనకు సినీ విమర్శకులు ప్రశంసలు కురిపించారు.
Updated on: Jul 19, 2023 | 4:51 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో గోల్డెన్ బ్యూటీగా క్రేజ్ సంపాదించుకుంది సంయుక్త. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత వరుసగా హిట్స్ అందుకుని స్టార్ డమ్ సంపాదించుకుంది.

భీమ్లా నాయక్, బింబిసార, సార్, విరూపాక్ష ఇలా ఈ బ్యూటీ నటించిన నాలుగు సినిమాలు హిట్ కావడంతో సంయుక్త టాలీవుడ్ ఇండస్ట్రీలో లక్కీ హీరోయిన్ గా మారింది. కేవలం తెలుగులోనే కాదు.. మలయాళంలోనూ మెప్పించింది.

ఇక విరూపాక్ష సినిమాలో సంయుక్త నటనకు సినీ విమర్శకులు ప్రశంసలు కురిపించారు. ఈ చిత్రంలో సంయుక్త అద్భుతంగా నటించిందని పొగిడారు. అయితే ఈ మూవీస్ తర్వాత తెలుగు సినీ పరిశ్రమలో సంయుక్త మరింత బిజీ కానుందని అంతా అనుకున్నారు.

కానీ గత కొద్ది రోజులుగా ఈ బ్యూటీ కెరీర్ కు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉండే సంయుక్త.. ప్రస్తుతం ఒకే ఒక్క సినిమాలో నటిస్తోంది. అదే డేవిల్. ఇందులో కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

అయితే హీరోయిన్ ప్రాధాన్యత ఉన్న సినిమాలు.. కథా బలం ఉంటేనే చేస్తానని సంయుక్త అంటోందట. కేవలం గ్లామర్, కమర్షియల్ మూవీస్ కాకుండా.. కంటెంట్ ప్రాధాన్యత ఉన్న సినిమాలు మాత్రమే చేస్తానని చెప్పిస్తోందట. దీంతో ఈ బ్యూటీకి ఆఫర్స్ తగ్గినట్లుగా సమాచారం.

అయితే తెలుగులో సైలెంట్ అయిన సంయుక్త.. అటు తమిళంలో.. ఇటు మలయాళంలో వరుస అవకాశాలను అందుకుంటుందని టాక్. మొత్తానికి అందరి హీరోయిన్స్ మాదిరిగా కాకుండా.. తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ సంపాదించుకోవాలని ఈ కేరళ కుట్టి ట్రై చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఇటీవలే విరూపాక్ష సినిమాతో మరో హిట్ అందుకున్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం డేవిల్ చిత్రంలో నటిస్తుంది. ఇందులో కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. బింబిసార తర్వాత ఈ సూపర్ హిట్ జోడి మరోసారి జత కడుతుంది.




