IND vs WI: ‘సెంచరీ చేసినా, బాధ పడ్డా..’ తొలి టెస్టుపై రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు..
Rohit Sharma, IND vs WI: భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ తనపై ఎంతో కాలంగా వస్తున్న విమర్శలకు వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో అద్భుతమైన సెంచరీతోనే జవాబు చెప్పాడు. 103 పరుగులతో రోహిత్, అరంగేట్ర మ్యాచ్‌లోనే 171 పరుగుల చేసిన యశస్వీ జైస్వాల్ శతకం వెస్టిండీస్‌పై..
Rohit Sharma, IND vs WI: భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ తనపై ఎంతో కాలంగా వస్తున్న విమర్శలకు వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో అద్భుతమైన సెంచరీతోనే జవాబు చెప్పాడు. 103 పరుగులతో రోహిత్, అరంగేట్ర మ్యాచ్‌లోనే 171 పరుగుల చేసిన యశస్వీ జైస్వాల్ శతకం వెస్టిండీస్‌పై టీమిండికు ఇన్నింగ్స్ 141 పరుగుల విజయాన్ని అందించాయి. అయితే మ్యాచ్‌లో తాను సెంచరీ చేసినా సంతోషంగా లేనని, పైగా బాధపడ్డానని రోహిత్ శర్మ అన్నాడు. ఆలిక్ అథనాజే బౌలింగ్‌లో విండీస్ కీపర్ జోషువా డా సిల్వాకు క్యాచ్ ఇచ్చుకుని ఔట్ అయిన రోహిత్ అనంతరం దానిపై మాట్లాడాడు.
తొలి టెస్టులో తాను ఔట్ అయిన తీరుపై రోహిత్ మాట్లాడుతూ ‘ఎప్పుడు అవుటైనా నిరుత్సాహపడడం అనేది సహజం. బాగా బ్యాటింగ్ చేస్తున్నానని అనుకున్న తొలి మ్యాచ్‌లో అవుటైనప్పుడు నేను చాలా డిసప్పాయింట్ అయ్యా. భారీ స్కోర్ చేయడానికి అది సువర్ణవకాశం. కానీ అవకాశం కోల్పోయినందుకు చింతించా. కానీ నా దృష్టి అంతా తప్పుల నుంచి నేర్చుకుని ముందుకు సాగడంపైనే ఉంద’ని అన్నాడు.
కాగా వెస్టిండీస్, భారత్ మధ్య రెండో టెస్ట్ ట్రినిటాడ్ వేదికగా జూలై 20న ప్రారంభం అవుతుంది. అలాగే ఆ మ్యాచ్ ఇరు దేశాలకు మధ్య జరగబోతున్న 100వ టెస్ట్ ఇంకా.. విరాట్ కోహ్లీకి 500వ అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం. రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ప్రస్తుతం భారత్ 1-0 తేడాతో ఆధిక్యంలో ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..