Asia Cup 2023: 42 పరుగులకే ప్రత్యర్థి జట్టు ఆలౌట్.. 217 పరుగుల తేడాతో శ్రీలంక భారీ విజయం..

Emerging Asia Cup 2023: శ్రీలంక వేదికగా జరుగుతున్న ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ టోర్నమెంట్‌లో ఆతిథ్య లంకేయుల ప్రత్యర్థిని 42 పరుగులకే నెలకరిపించి 217 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. లంక జట్టు విజయానికి కారణమైన ఆకట్టుకునే ప్రదర్శన కంటే..

Asia Cup 2023: 42 పరుగులకే ప్రత్యర్థి జట్టు ఆలౌట్.. 217 పరుగుల తేడాతో శ్రీలంక భారీ విజయం..
SL A vs Oman A
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jul 19, 2023 | 7:26 PM

Emerging Asia Cup 2023: శ్రీలంక వేదికగా జరుగుతున్న ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ టోర్నమెంట్‌లో ఆతిథ్య లంకేయుల ప్రత్యర్థిని 42 పరుగులకే నెలకరిపించి 217 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. లంక జట్టు విజయానికి కారణమైన ఆకట్టుకునే ప్రదర్శన కంటే ఒమన్ జట్టు ప్రదర్శనే ఇప్పుడు అందరినీ షాక్ చేస్తుంది. వన్డే క్రికెట్‌లో అది కూడా చేజింగ్ సమయంలో 42 పరుగులకే ఒమన్ ఎ జట్టు కుప్పకూలిపోవడం సర్వత్రా చర్చనీయంగా మారింది.

అయితే మ్యాచ్‌కి ముందు టాస్ గెలిచిన ఒమన్ టీమ్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాలింగ్‌కి దిగిన లంకన్స్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. ఈ క్రమంలో పరిందు సూరియబండర 60 పరుగులతో, సహన్ అరచ్చిగే 48 రన్స్‌తో రాణించారు. లంక జట్టు తరఫున టెయిలెండర్లు కూడా పర్వాలేదనిపించారు. అనంతరం 260 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఒమన్ యువ ప్లేయర్లు ఆశ్చర్యకరంగా పెవిలియన్ చేరారు. ఓపెనర్‌గా వచ్చిన కశ్యప్ ప్రజాపతి(18), ఏదో నెంబర్‌లో వచ్చిన సూరజ్ కుమార్(10) మినహా మరెవరూ కనీసం 7 పరుగుల మార్క్ దాటలేదు.

మరోవైపు శ్రీలంక బౌలర్లలో చమికా కరుణరత్నే 3 వికెట్లు తీసుకోగా, ప్రమోద్ మదుషన్, దునిత్ వెల్లలాగే, లాహీరు సమరకూన్ రెండేసి వికెట్లు పడగొట్టారు. సహన్ అరచ్చిగే మరో వికట్ తీసుకున్నాడు.

ఇవి కూడా చదవండి

శ్రీలంక ప్లేయింగ్ 11: అవిష్క ఫెర్నాండో, లసిత్ క్రుస్పుల్లే, మినోద్ భానుక (వికెట్ కీపర్), పసిందు సూర్యబండార, సహన్ అరాచిగె, అషెన్ బండార, దునిత్ వెల్లాలఘే (కెప్టెన్), చమిక కరుణరత్నే, దుషన్ హేమంత, ప్రమోద్ మధుషన్, లహిరు సమరకాన్.

ఒమన్ ప్లేయింగ్ 11: కశ్యప్ ప్రజాపతి, జతీందర్ సింగ్, అకిబ్ ఇలియాస్ (కెప్టెన్), అయాన్ ఖాన్, షోయబ్ ఖాన్, వసీం అలీ, సూరజ్ కుమార్ (వికెట్ కీపర్), రఫీవుల్లా, సమయ్ శ్రీవాస్తవ, జే ఒడెద్రా, కలీముల్లా.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..