AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asia Cup Schedule: ఆసియా కప్‌ అఫీషియల్‌ షెడ్యూల్‌ వచ్చేసిందోచ్‌.. భారత్‌-పాక్‌ మ్యాచ్‌ ఎప్పుడంటే?

ఎన్నో వివాదాలు, ప్రతిష్ఠంభనల తర్వాత తర్వాత ఎట్టకేలకు ఆసియా కప్ 2203 షెడ్యూల్ విడుదలైంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్, బీసీసీఐ కార్యదర్శి జై షా టోర్నీ మొత్తం షెడ్యూల్‌ను బుధవారం సాయంత్రం ప్రకటించారు.

Asia Cup Schedule: ఆసియా కప్‌ అఫీషియల్‌ షెడ్యూల్‌ వచ్చేసిందోచ్‌.. భారత్‌-పాక్‌ మ్యాచ్‌ ఎప్పుడంటే?
Asia Cup 2023 Schedule
Basha Shek
|

Updated on: Jul 19, 2023 | 8:03 PM

Share

ఎన్నో వివాదాలు, ప్రతిష్ఠంభనల తర్వాత తర్వాత ఎట్టకేలకు ఆసియా కప్ 2203 షెడ్యూల్ విడుదలైంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్, బీసీసీఐ కార్యదర్శి జై షా టోర్నీ మొత్తం షెడ్యూల్‌ను బుధవారం సాయంత్రం ప్రకటించారు. ఈ టోర్నమెంట్‌లో అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అత్యంత ముఖ్యమైన మ్యాచ్, అంటే సెప్టెంబర్ 2న భారత్-పాకిస్థాన్ పోరు జరగనుంది. ఈ మ్యాచ్ ఊహించినట్లుగానే శ్రీలంకలోని క్యాండీలో జరగనుంది. ఆతిథ్య పాకిస్థాన్‌లోని ముల్తాన్‌లో ఆగస్టు 30న టోర్నీ ప్రారంభం కానుంది. అదే సమయంలో, టోర్నమెంట్ ఫైనల్ సెప్టెంబర్ 17న కొలంబోలో జరుగుతుంది. కాగా ఆసియా కప్ నిర్వహణపై గతేడాది నుంచి వివాదం నడుస్తోంది. సుదీర్ఘ చర్చలు, ఒప్పందాల అనంతరం ఎట్టకేలకు పాకిస్థాన్‌, శ్రీలంకతో టోర్నీ మ్యాచ్‌లు నిర్వహించేందుకు అంగీకారం కుదిరింది. ఈ ‘హైబ్రిడ్ మోడల్’ కింద, 13 మ్యాచ్‌ల టోర్నమెంట్‌లో 4 మ్యాచ్‌లు పాకిస్థాన్‌లో జరగనుండగా, ఫైనల్‌తో సహా 9 మ్యాచ్‌లకు శ్రీలంక ఆతిథ్యమివ్వనుంది.

హైబ్రిడ్ మోడల్ లోనే..

ఈ హైబ్రిడ్ మోడల్ ఆధారంగా టోర్నీ షెడ్యూల్ కూడా ప్రకటించారు. ఈ టోర్నీకి పాకిస్థాన్, శ్రీలంకలోని 2 నగరాలు ఆతిథ్యమివ్వనున్నాయి.. గతంలో పాకిస్థాన్‌లోని లాహోర్‌లో మాత్రమే మ్యాచ్‌లు జరుగుతాయని, వర్షాకాలం కారణంగా శ్రీలంకలోని కొలంబోలో కాకుండా దంబుల్లాలో మ్యాచ్‌లు జరుగుతాయని పేర్కొన్నారు. అయితే అదేమీ జరగలేదు. ఆగస్టు 30న ముల్తాన్‌ వేదికగా పాకిస్తాన్‌ వర్సెస్‌ నేపాల్‌ మ్యాచ్‌తో ఆసియా కప్‌ టోర్నీ ప్రారంభం కానుంది. పాకిస్థాన్‌లో మిగిలిన 3 మ్యాచ్‌లు లాహోర్‌ వేదికగా జరుగుతాయి. అందులో సూపర్-4 మ్యాచ్ కూడా ఉంది. మరోవైపు శ్రీలంక జట్టుకు క్యాండీలో గ్రూప్ దశ మ్యాచ్‌లు జరగనుండగా, మిగిలిన సూపర్-4, ఫైనల్ మ్యాచ్‌లు కొలంబోలో జరుగుతాయి.

ఇవి కూడా చదవండి

భారత్ షెడ్యూల్‌ ఎలా ఉందంటే?

ఇక టీమిండియా విషయానికి వస్తే.. తొలి మ్యాచ్ పాకిస్థాన్‌తో జరగనుంది. ఈ మ్యాచ్ సెప్టెంబర్ 2వ తేదీ శనివారం శ్రీలంకలోని క్యాండీ వేదికగా జరగనుంది. ఇక సెప్టెంబర్ 4న, భారత జట్టు తన గ్రూప్‌లోని రెండవ జట్టు నేపాల్‌తో తలపడుతుంది. మరోవైపు సూపర్-4లో టీమిండియా, పాకిస్థాన్‌లు అర్హత సాధిస్తే.. సెప్టెంబర్ 10న ఇరు జట్లు మళ్లీ పోటీపడనున్నాయి. ఒకవేళ ఇరు జట్లు ఫైనల్‌కు చేరితే, సెప్టెంబర్ 17న కొలంబోలో టైటిల్ కోసం మూడోసారి తలపడతాయి.

వన్డే ఫార్మాట్‌లోనే మ్యాచ్‌లు..

అక్టోబర్‌-నవంబర్‌లో జరగనున్న వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని ఈసారి వన్డే ఫార్మాట్‌లో మాత్రమే టోర్నీ జరగనుంది. చివరిసారి టీ20 ఫార్మాట్‌లో జరిగింది. టోర్నమెంట్‌లో 6 జట్లు పాల్గొంటున్నాయి – భారతదేశం, పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్. ఇందులో భారత్, పాకిస్థాన్, నేపాల్ జట్లను గ్రూప్-ఎలో ఉంచారు. గ్రూప్-బిలో బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్ జట్లు ఉన్నాయి. రెండు గ్రూపుల్లోని జట్లు ఒక్కోసారి తలపడతాయి. ఇందులో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్-4 దశకు చేరుకుంటాయి. ఇది రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో ఆడబడుతుంది, ఇక్కడ ప్రతి జట్టు ఇతర మూడు జట్లతో ఢీకొంటుంది. ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య ఫైనల్‌ జరుగుతుంది.

టోర్నమెంట్ షెడ్యూల్

గ్రూప్‌ స్టేజ్‌

  • ఆగస్టు 30 – పాకిస్తాన్ vs నేపాల్ (ముల్తాన్, పాకిస్తాన్)
  • 31 ఆగస్టు – బంగ్లాదేశ్ vs శ్రీలంక (కాండీ, శ్రీలంక)
  • సెప్టెంబర్ 2 – పాకిస్తాన్ vs భారతదేశం (కాండీ, శ్రీలంక)
  • సెప్టెంబర్ 3 – బంగ్లాదేశ్ vs ఆఫ్ఘనిస్తాన్ (లాహోర్, పాకిస్తాన్)
  • సెప్టెంబర్ 4 – భారత్ vs నేపాల్ (కాండీ, శ్రీలంక)
  • సెప్టెంబర్ 5 – ఆఫ్ఘనిస్తాన్ vs శ్రీలంక (లాహోర్, పాకిస్తాన్)

సూపర్-4

  • సెప్టెంబర్ 6 – A1 vs B2 (లాహోర్, పాకిస్తాన్)
  • సెప్టెంబర్ 9 – B1 vs B2 (కొలంబో, శ్రీలంక)
  • సెప్టెంబర్ 10 – A1 vs A2 (కొలంబో, శ్రీలంక)
  • 12 సెప్టెంబర్ – A2 vs B1 (కొలంబో, శ్రీలంక)
  • సెప్టెంబర్ 14 – A1 vs B1 (కొలంబో, శ్రీలంక)
  • సెప్టెంబర్ 15 – A2 vs B2 (కొలంబో, శ్రీలంక)

ఫైనల్ 

  • సెప్టెంబర్ 17 – సూపర్-4 (1 vs 2) – (కొలంబో, శ్రీలంక)

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..