Pragathi: ‘కొత్త ప్రయాణం మొదలైంది’.. ఇకపై ప్రొఫెషనల్‌ పవర్‌ లిఫ్టర్‌గా నటి ప్రగతి.. వైరల్‌ వీడియో చూశారా?

లాక్‌డౌన్‌ నుంచి వెయిట్‌ లిఫ్టింగ్ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేస్తూనే ఉంది ప్రగతి. అయితే సినిమాల్లో బిజిబిజీగా ఉండే ఆమె ఫిట్‌ నెస్‌ కోసం లేదా ఏదో సరదాకి వీటిని పోస్ట్‌ చేస్తుందనుకున్నారు చాలామంది. అయితే ఉన్నట్లుండి అందరికీ సర్ ప్రైజ్ ఇచ్చిందీ సీనియర్‌ నటీమణి.

Pragathi: 'కొత్త ప్రయాణం మొదలైంది'.. ఇకపై ప్రొఫెషనల్‌ పవర్‌ లిఫ్టర్‌గా నటి ప్రగతి.. వైరల్‌ వీడియో చూశారా?
Actress Pragathi
Follow us
Basha Shek

|

Updated on: Jul 18, 2023 | 7:30 PM

సినిమాలతో పాటు సోషల్‌ మీడియాలోనూ ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటుంది ప్రముఖ నటి ప్రగతి. ముఖ్యంగా జిమ్‌లో ఆమె చేసే వర్కవుట్లు, వెయిట్‌ లిఫ్టింగ్‌ వీడియోలు నెట్టింగ తెగ వైరలవుతుంటాయి. అభిమానులు, నెటిజన్ల నుంచి కూడా మంచి స్పందన వస్తుంటుంది. లాక్‌డౌన్‌ నుంచి వెయిట్‌ లిఫ్టింగ్ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేస్తూనే ఉంది ప్రగతి. అయితే సినిమాల్లో బిజిబిజీగా ఉండే ఆమె ఫిట్‌ నెస్‌ కోసం లేదా ఏదో సరదాకి వీటిని పోస్ట్‌ చేస్తుందనుకున్నారు చాలామంది. అయితే ఉన్నట్లుండి అందరికీ సర్ ప్రై జ్ ఇచ్చిందీ సీనియర్‌ నటీమణి. ప్రొఫెషనల్‌ పవర్‌ లిఫ్టర్‌గా సరికొత్త అవతారం ఎత్తింది. ఈమేరకు కొత్త జర్నీ మొదలైందంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను పోస్ట్‌ చేసింది ప్రగతి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

‘కొత్త జర్నీ మొదలైంది. 2 నెలల క్రితం నా లైఫ్‌ ఇన్ని మలుపులు తిరుగుతుందని నేను అసలు అనుకోలేదు. పవర్ లిఫ్టింగ్‌లో నా కొత్త ప్రయాణం ఇది. రెండు నెలల క్రితం మొదలైంది ఈ జర్నీ. ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. ఆ టార్గెట్‌ను అందుకుంటాను. ప్రస్తుతానికి 250 స్కోర్‌ సాధించాను. అయితే లక్ష్యం చాలా పెద్దదిగా ఉంది. అయితే టార్గెట్‌ను అందుకునేవరకు వెనక్కు తగ్గను. నన్ను పవర్‌ లిఫ్టింగ్‌ వైపు ఎంకరేజ్‌ చేసిన వారందికీ కృతజ్ఞతలు’ అని తనను ప్రోత్సహించిన వారందరినీ ఈ పోస్టుకు ట్యాగ్ చేసింది ప్రగతి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ప్రగతికి ఆల్‌ ది బెస్ట్‌ చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?