Asvins: ఓటీటీ ఆడియెన్స్‌ను భయపెట్టేందుకు వస్తోన్న అశ్విన్స్‌.. లేటెస్ట్‌ హారర్ మూవీ స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

ఓటీటీలో క్రైమ్‌, హారర్‌, సస్పెన్స్‌, థ్రిల్లర్‌ జోనర్‌ సినిమాలకు మంచి ఆదరణ ఉంటుంది. అందుకు తగ్గట్టే వివిధ రకాల ఓటీటీ సంస్థలు ఆసక్తికరమైన సినిమాలు, వెబ్‌ సిరీస్‌లను స్ట్రీమింగ్‌కు తెస్తుంటాయి. ఒక్కోసారి థియేటర్లలో హిట్‌ కానీ సినిమాలు కూడా ఓటీటీల్లో సూపర్ హిట్‌ అవుతుంటాయి.

Asvins: ఓటీటీ ఆడియెన్స్‌ను భయపెట్టేందుకు వస్తోన్న అశ్విన్స్‌.. లేటెస్ట్‌ హారర్ మూవీ స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?
Asvins Movie
Follow us
Basha Shek

|

Updated on: Jul 17, 2023 | 7:56 PM

ఓటీటీలో క్రైమ్‌, హారర్‌, సస్పెన్స్‌, థ్రిల్లర్‌ జోనర్‌ సినిమాలకు మంచి ఆదరణ ఉంటుంది. అందుకు తగ్గట్టే వివిధ రకాల ఓటీటీ సంస్థలు ఆసక్తికరమైన సినిమాలు, వెబ్‌ సిరీస్‌లను స్ట్రీమింగ్‌కు తెస్తుంటాయి. ఒక్కోసారి థియేటర్లలో హిట్‌ కానీ సినిమాలు కూడా ఓటీటీల్లో సూపర్ హిట్‌ అవుతుంటాయి. ప్రమోషన్స్‌ లేకపోవడం ఇందుకు ప్రధాన కారణం. అలా ఇటీవల థియేటర్లలో విడుదలైన ఓ హారర్ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. అదే అశ్విన్స్‌. జూన్‌ 23న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ పెద్దగా ఆడలేదు. ప్రమోషన్స్‌ లేకపోవడం వల్ల స్టోరీ బాగున్నా కలెక్షన్లు రాలేదు. అలాగే సౌండ్‌ డిజైనింగ్‌ కూడా సూపర్బ్‌గా ఉందని ప్రశంసలు వచ్చాయి. కానీ ఆడియెన్స్‌ మాత్రం థియేటర్లకు రాలేకపోయారు. అశ్విన్స్ సినిమాలో వ‌సంత్ ర‌వితో ప్రముఖ హీరోయిన్‌ విమలారామన్‌ కీలక పాత్రలు పోషించారు. తరుణ్‌ తేజ దర్శకత్వం వహించగా, ప్రముఖ నిర్మాత బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ తెలుగులో అశ్విన్స్‌ను రిలీజ్‌ చేశారు. థియేటర్లలో పెద్దగా ఆడని ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ఆడియెన్స్‌ను భయపెట్టేందుకు వస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ అశ్విన్స్‌ మూవీ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కులను సొంతం చేసుకుంది. జులై 20 నుంచి ఈ మూవీ ఓటీటీలో అందుబాటులో ఉండనుంది. తెలుగు, తమిళ్‌, మలయాళ, కన్నడ భాషల్లో అశ్విన్స్‌ స్ట్రీమింగ్‌ కానుంది. ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటించింది నెట్‌ఫ్లిక్స్‌.

కథేంటంటే..

ఇక అశ్విన్స్‌ మూవీ కథ విషయానికొస్తే.. ఓ ప్రముఖ యూట్యూబర్‌ అయిన అర్జున్‌ (వసంత్‌ రవి) అతని ఫ్రెండ్స్‌ దెయ్యాలున్న ఇళ్లలు, కోటల్లో వీడియోలు చేస్తుంటారు. అలా ఒకసారి లండన్‌ శివారులో ఉన్న దెయ్యాల కోటకు వెళతారు. ఈ పురాతన భవంతిలో ఆర్కియాల‌జిస్ట్ ఆర్తి రాజ‌గోపాల్ (విమ‌లారామ‌న్) ఆత్మ తిరుగుతుందని, కోటలో అడుగుపెట్టిన వారందరినీ చంపుతుందని తెలుసుకుంటారు. అలాంటి కోటలో అడుగుపెట్టిన అర్జున్‌, అతని స్నేహితులు ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్నారనేదే అశ్విన్స్‌ మూవీ కథ.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.