Nayakudu OTT: ఇట్స్ అఫీషియల్.. అప్పుడే ఓటీటీలోకి ‘నాయకుడు’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
ఇప్పటివరకు కమెడియన్‌గానే మనకు తెలిసిన వడివేలు మొదటిసారి సీరియస్ యాక్షన్ రోల్‌లో నటించిన చిత్రం నాయకుడు (మామాన్నన్). ఉదయనిధి స్టాలిన్ హీరోగా నటించిన ఈ లేటెస్ట్ కోలీవుడ్ హిట్ మూవీలో ఫాహద్ ఫాజిల్ ప్రతినాయకుడిగా ఆకట్టుకున్నారు. మహానటి కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది
ఇప్పటివరకు కమెడియన్‌గానే మనకు తెలిసిన వడివేలు మొదటిసారి సీరియస్ రోల్‌లో నటించిన చిత్రం నాయకుడు (మామాన్నన్). ఉదయనిధి స్టాలిన్ హీరోగా నటించిన ఈ లేటెస్ట్ కోలీవుడ్ హిట్ మూవీలో ఫాహద్ ఫాజిల్ ప్రతినాయకుడిగా ఆకట్టుకున్నారు. మహానటి కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. రాజకీయాల్లోని అసమానతలపై చర్చిస్తూ మారి సెల్వరాజ్ అద్భుతంగా ఈ సినిమాను తీర్చిదిద్దాడు. తమిళంలో ఈ పొలిటికల్ డ్రామా సూపర్‌హిట్‌గా నిలిచింది. జూన్ 29న రిలీజైన మామన్నన్ సుమారు రూ. 50 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టింది. అయితే తెలుగులో మాత్రం రెండు వారాలు ఆలస్యంగా జులై 14న విడుదల చేశారు. సురేష్ ప్రొడక్షన్స్, ఏషియన్ సినిమాస్ సంస్థలు నాయకుడు పేరుతో ఈ పొలిటికల్ డ్రామాను తెలుగు ప్రేక్షకులకు అందించారు. అయితే ప్రమోషన్ల లోపం, దీనికి తోడు బేబీ సూపర్‌హిట్ టాక్ తెచ్చుకోవడంతో నాయకుడిని పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. అయితే ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి రానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ నాయకుడు డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను సొంతం చేసుకుంది.
నాయకుడు మూవీ స్ట్రీమింగ్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సుమారు రూ. 10 కోట్లకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో జులై 27 నుంచి నాయకుడు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది సదరు ఓటీటీ ప్లాట్‌ఫామ్. అయితే తెలుగు వెర్షన్ రిలీజైన 13 రోజులకే ఓటీటీలో మామన్నన్ రిలీజ్ కావడం గమనార్హం. తమిళ్‌తో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లోనూ నాయకుడు అందుబాటులో ఉండనుంది. ఈ సినిమాకు ఏ ఆర్ రెహమాన్ స్వరాలు సమకూర్చడం విశేషం. మరి థియేటర్లలో నాయకుడు మిస్ అయిన వారు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి..
VADIVELU, UDHAYANIDHI, FAHADH, KEERTHY, MARI SELVARAJ AND AR RAHMAN TOGETHER!! We’re seeing stars🤩#Maamannan, coming to Netflix on the 27th of July!🍿#MaamannanOnNetflix pic.twitter.com/Fl8ulKvdID
— Netflix India South (@Netflix_INSouth) July 18, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..