AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thandatti: ఓటీటీలో ‘తందట్టి’కి సూపర్‌ రెస్పాన్స్‌.. థ్రిల్‌కు గురిచేసే క్లైమాక్స్‌ ట్విస్ట్‌.. ఎక్కడ చూడొచ్చంటే?

'మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే' అని ఒక రాజనీతిజ్ఞుడు చెప్పిన మాటలు ఈ సినిమా చూస్తే నిజమనిపిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు మానవీయ సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయో ఈ సినిమాలో ఎంతో హృద్యంగా చూపించారు డైరెక్టర్‌.

Thandatti: ఓటీటీలో 'తందట్టి'కి సూపర్‌ రెస్పాన్స్‌.. థ్రిల్‌కు గురిచేసే క్లైమాక్స్‌ ట్విస్ట్‌.. ఎక్కడ చూడొచ్చంటే?
Thandatti Movie
Basha Shek
|

Updated on: Jul 18, 2023 | 8:07 PM

Share

ఇటీవల ఓటీటీలో ఆసక్తికరమైన సినిమాలు రిలీజవుతున్నాయి. ముఖ్యంగా మలయాళ, తమిళ సినిమాలు ఓటీటీ ఆడియెన్స్‌ను తెగ ఆకట్టుకుంటున్నాయి. వైవిధ్యమైన కథ, కథనాలు, ఊహించని ట్విస్టులతో థ్రిల్‌కు గురిచేస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం ఇరాట్ట అనే మలయాళ సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ తెరపై చిన్నపాటి సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. ఇప్పుడు అదే తరహాలో ఒక సినిమా ఓటీటీ ఆడియెన్స్‌ను ఆలోచింపజేస్తుంది. అదే తందట్టి. ‘మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే’ అని ఒక రాజనీతిజ్ఞుడు చెప్పిన మాటలు ఈ సినిమా చూస్తే నిజమనిపిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు మానవీయ సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయో ఈ సినిమాలో ఎంతో హృద్యంగా చూపించారు డైరెక్టర్‌. తందట్టిలో పశుపతి రామస్వామి, రోహిణి, వివేక్‌ ప్రసన్న కీలక పాత్రలు పోషించారు. జూన్‌ 23న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ తమిళ ఆడియెన్స్‌ను అమితంగా ఆకట్టుకుంది. కలెక్షన్లు కూడా వచ్చాయి. ఇప్పుడీ ఎమోషనల్‌ కామెడీ డ్రామా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. శుక్రవారం (జులై 14) నుంచి తందట్టి ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది.

కథేంటంటే..

తందట్టి సినిమా తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లోనూ స్ట్రీమింగ్‌ అవుతోంది. ఇక కథవిషయానికొస్తే.. వీర సుబ్రమణియన్‌ (పశుపతి) హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తుంటాడు. మరో పదిరోజుల్లో అతను రిటైర్‌ అవ్వాల్సి ఉంటుంది. ఇంతలోనే తంగపొన్ను(రోహిణి) అనే వృద్ధురాలు తప్పిపోయిందంటూ ఆమె మనవడు పోలీసులను ఆశ్రయిస్తాడు. అయితే ఎవరూ ఆ పిల్లాడిని పట్టించుకోరు. చివరకు సుబ్రమణియన్‌ బామ్మను వెతికే బాధ్యత తీసుకుంటాడు. ఈక్రమంలో సుబ్రమణియన్‌కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ఇంతకీ వృద్ధురాలి ఆచూకీ దొరికిందా?లేదా? అన్నది తెలుసుకోవాలంటే తందట్టి మూవీ చూడాల్సిందే. సినిమా అంతా ఒకటైతే.. క్లైమాక్స్‌ ట్విస్ట్‌ మరో లెవెల్‌. ఇదే ప్రేక్షకులను థ్రిల్‌కు గురిచేస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.

విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం
విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!