Baby Movie: ‘బేబీ’ ఓటీటీ రిలీజ్‌కు ముహూర్తం ఖరారు! ఆ స్పెషల్‌ డే రోజునే స్ట్రీమింగ్‌

బేబీ.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బాగా వినిపిస్తోన్న పేరు. యువతతో పాటు సగటు సినీ ప్రేక్షకులు ఈ ఫీల్‌ గుడ్‌ లవ్‌ స్టోరీని ను చూసేందుకు థియేటర్లకు పోటెత్తుతున్నారు. ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్‌ అశ్విన్‌ల క్యారెక్టర్లకు ప్రతి ఒక్కరూ కనెక్ట్‌ అవుతున్నారు.

Baby Movie: 'బేబీ' ఓటీటీ రిలీజ్‌కు ముహూర్తం ఖరారు! ఆ స్పెషల్‌ డే రోజునే స్ట్రీమింగ్‌
Baby Movie
Follow us
Basha Shek

|

Updated on: Jul 19, 2023 | 4:27 PM

బేబీ.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బాగా వినిపిస్తోన్న పేరు. యువతతో పాటు సగటు సినీ ప్రేక్షకులు ఈ ఫీల్‌ గుడ్‌ లవ్‌ స్టోరీని ను చూసేందుకు థియేటర్లకు పోటెత్తుతున్నారు. ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్‌ అశ్విన్‌ల క్యారెక్టర్లకు ప్రతి ఒక్కరూ కనెక్ట్‌ అవుతున్నారు. జులై 14న విడుదలైన బేబీ బాక్సాఫీస్‌ దుమ్ము దులుపుతోంది. ఐదు రోజులకు గానూ రూ.38 కోట్లకు పైగానే వసూళ్లను రాబట్టింది. 50 కోట్ల క్లబ్‌లే చేరేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. ఇదిలా ఉంటే బేబీ మూవీ ఓటీటీ రిలీజ్‌కి సంబంధించి ఒక వార్త సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ ఆహా బేబీ సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కులను సొంతం చేసుకుంది. థియేటర్లలో రిలీజైన నెల రోజులకు అంటే ఆగస్టు 15న ఈ యూత్‌ ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ను ఓటీటీలో స్ట్రీమింగ్‌ చేయనున్నట్లు తెలుస్తుంది.

సాధారణ రోజుల్లో సెలవు రోజుల్లో రీచ్‌ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇండిపెండెన్స్‌ డే రోజేనే బేబీ సినిమాను అందుబాటులోకి తెస్తున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. సాయి రాజేష్‌ దర్శకత్వం వహించిన బేబీ సినిమాలో నాగబాబు, వైవా హర్ష, ప్రభావతి తదితరులు కీలక పాత్రలు పోషించారు. విజయ్‌ బుల్గానిన్‌ అందించిన స్వరాలు ప్రత్యేకాకర్షణగా నిలిచాయి. మాస్‌ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై ఎస్‌కేఎసన్‌ ఈ మూవీని నిర్మించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?