AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress: ఈ చిన్నారిని గుర్తుపట్టారా? సిల్వర్‌ స్క్రీన్‌పై అసలు సిసలు సౌందర్యమంటే ఈ స్టార్‌ హీరోయిన్‌దే..

తన అందం, అభినయంతో దక్షిణాదిన స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందింది. హిందీలోనూ సూపర్‌ హిట్ సినిమాల్లో నటించింది. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌, అమితాబ్‌ బచ్చన్‌, రజనీకాంత్‌, జగపతి బాబు, శ్రీకాంత్, రాజేంద్రప్రసాద్, రాజశేఖర్, విష్ణు వర్థన్ తదితర స్టార్‌ హీరోలతో జతకట్టారు. వెండితెరపై తిరుగులేని నటిగా గుర్తింపు పొందింది.

Actress: ఈ చిన్నారిని గుర్తుపట్టారా? సిల్వర్‌ స్క్రీన్‌పై అసలు సిసలు సౌందర్యమంటే ఈ స్టార్‌ హీరోయిన్‌దే..
Actress Childhood Photo
Basha Shek
|

Updated on: Jul 17, 2023 | 9:02 PM

Share

పై ఫొటోలో క్యూట్‌గా కనిపిస్తున్న చిన్నారిని గుర్తుపట్టారా? ఆమె ఒక ప్రముఖ హీరోయిన్‌. డాక్టరై స్టెతస్కోప్‌ పట్టుకుందామని అనుకోకుండా సిల్వర్‌ స్క్రీన్‌పై అడుగుపెట్టింది. సాధారణంగా సినిమాలంటేనే గ్లామర్‌. హీరోయిన్లు కూడా స్కిన్‌ షో చేస్తేనే సక్సెస్‌ అవుతారని కొందరి అభిప్రాయం. అయితే ఈ అందాల తార మాత్రం హోమ్లీ హీరోయిన్‌గానే గుర్తింపు తెచ్చుకుంది. తన అందం, అభినయంతో దక్షిణాదిన స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందింది. హిందీలోనూ సూపర్‌ హిట్ సినిమాల్లో నటించింది. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌, అమితాబ్‌ బచ్చన్‌, రజనీకాంత్‌, జగపతి బాబు, శ్రీకాంత్, రాజేంద్రప్రసాద్, రాజశేఖర్, విష్ణు వర్థన్ తదితర స్టార్‌ హీరోలతో జతకట్టారు. వెండితెరపై తిరుగులేని నటిగా గుర్తింపు పొందింది. అయితే ఆమె సక్సెస్‌ను చూసి విధికి కన్ను కుట్టిందేమో. కేవలం 32 ఏళ్లకే ఓ ప్రమాదంలో కన్నుమూసింది. అయితే తన సినిమాల రూపంలో నిత్యం ప్రేక్షకుల మనసులో నిలిచిపోతుంది. అభినవ సావిత్రిగా వెండితెరపై చెరగని ముద్ర వేసిన నటి ఎవరో మరెవరో కాదు.. సౌందర్య.

సౌందర్య ఏప్రిల్ 17, 2004 లో విమాన ప్రమాదంలో చిన్న వయసులో కన్నుమూశారు. ఓ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వెళుతుండగా అనుకోకుండా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సౌందర్యతో పాటు ఆమె తమ్ముడు కూడా మరణించాడు. కాగా మంగళవారం (జులై 18) సౌందర్య జయంతి. ఈ సందర్భంగా తన చిన్ననాటి, అరుదైన ఫొటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఈ సందర్భంగా అభిమానులు, నెటిజన్లు సౌందర్య సినిమాలను గుర్తుతెచ్చుకుంటున్నారు. నెట్టింట సౌందర్య ఫొటోస్‌, వీడియోలు, పాత ఇంటర్వ్యూలకు సంబంధించిన పోస్టులు షేర్‌ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి
Soundarya

Soundarya

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
సిబిల్ స్కోర్ తక్కువుండి ఇబ్బంది పడుతున్నారా..? ఈ పనులు చేస్తే..
సిబిల్ స్కోర్ తక్కువుండి ఇబ్బంది పడుతున్నారా..? ఈ పనులు చేస్తే..
భారతీయ సంస్కృతికి విదేశీ మహిళ ఫిదా.. బెస్ట్ అంటూ కితాబు!
భారతీయ సంస్కృతికి విదేశీ మహిళ ఫిదా.. బెస్ట్ అంటూ కితాబు!
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సీనియర్ హీరోయిన్..
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సీనియర్ హీరోయిన్..
ప్రతిరోజూ ఖాళీ కడుపుతో మునగాకు నీళ్లు తాగుతున్నారా..?ఇది తెలిస్తే
ప్రతిరోజూ ఖాళీ కడుపుతో మునగాకు నీళ్లు తాగుతున్నారా..?ఇది తెలిస్తే
2026లో ధనవంతులు అవ్వాలంటే.. ఇలా చేయండి!
2026లో ధనవంతులు అవ్వాలంటే.. ఇలా చేయండి!
జాగ్రత్త గురూ.. తక్కువ తాగినా ముప్పుతప్పదట.. తాజా అధ్యయనంలో సంచలన
జాగ్రత్త గురూ.. తక్కువ తాగినా ముప్పుతప్పదట.. తాజా అధ్యయనంలో సంచలన
ఏపీ స్కూల్స్‌కు సంక్రాంతి సెలవులు లిస్టు వచ్చేసిందోచ్..
ఏపీ స్కూల్స్‌కు సంక్రాంతి సెలవులు లిస్టు వచ్చేసిందోచ్..
ఒకే రోజు 29 మ్యాచ్‌లు..38కోట్ల ప్రైజ్ మనీ..అసలేంటి బాక్సింగ్ డే
ఒకే రోజు 29 మ్యాచ్‌లు..38కోట్ల ప్రైజ్ మనీ..అసలేంటి బాక్సింగ్ డే