Harshaali Malhotra: సల్మాన్ ‘భజరంగీ భాయ్‌జాన్‌ ‘ మున్ని గుర్తుందా? ఇప్పుడు ఎంత అందంగా ఉందో చూశారా?

సుమారు పదేళ్ల క్రితం వచ్చిన భజరంగీ భాయ్‌జాన్‌ సినిమా ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కబీర్‌ ఖాన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సల్మాన్‌ ఖాన్‌, కరీనా కపూర్‌ హీరో, హీరోయిన్లుగా నటించారు. వీరితో పాటు ఈ మూవీలో ఒక పాప తనదైన క్యూట్‌ నటనతో అందరి దృష్టిని ఆకర్షించింది.

Harshaali Malhotra: సల్మాన్ 'భజరంగీ భాయ్‌జాన్‌ ' మున్ని గుర్తుందా? ఇప్పుడు ఎంత అందంగా ఉందో చూశారా?
Harshaali Malhotra
Follow us
Basha Shek

|

Updated on: Jul 16, 2023 | 9:20 PM

సుమారు పదేళ్ల క్రితం వచ్చిన భజరంగీ భాయ్‌జాన్‌ సినిమా ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కబీర్‌ ఖాన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సల్మాన్‌ ఖాన్‌, కరీనా కపూర్‌ హీరో, హీరోయిన్లుగా నటించారు. వీరితో పాటు ఈ మూవీలో ఒక పాప తనదైన క్యూట్‌ నటనతో అందరి దృష్టిని ఆకర్షించింది. షాహిదా మున్నిగా ఎలాంటి మాటల్లేకుండా కేవలం హావభావాలతోనే అందరినీ ఏడిపించేసింది. ముఖ్యంగా సినిమా ఆఖరులో హర్షాలి సీన్స్‌ కట్టిపడేస్తాయి. అలా తన నటనతో ఆకట్టుకున్న ఆ అమ్మాయి పేరు హర్షాలి హర్షాలి మల్హోత్రా. ఈ సినిమాకు ముందు ఖుబూల్‌ హై వంటి కొన్ని సీరియల్స్‌లోనూ నటించింది. అయితే సల్మాన్‌ ఖాన్‌ సినిమాతోనే మంచి గుర్తింపు పొందింది. అలా చిన్న వయసులోనే బాలీవుడ్ లో స్టార్‌డమ్‌ సంపాదించుకున్న హర్షాలి భజరంగి తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించలేదు. అయితే సోషల్‌ మీడియాలో మాత్రం చురుగ్గా ఉంటుంది. తరచూ తన ఫొటోలను అందులో షేర్‌ చేస్తుంటుంది. భజరంగి భాయ్‌జాన్‌ సినిమాలో నటించేటప్పుడు హర్షాలి 1వ తరగతి చదువుతుండేది. ఆ మూవీ తర్వాత మళ్లీ చదువుకే ప్రాధాన్యమిచ్చింది. ఇప్పుడు తన వయసు 15 సంవత్సరాలు.

ఇవి కూడా చదవండి

సోషల్ మీడియాలో ఫుల్‌ యాక్టివ్‌గా ఉండే హర్షాలి మల్హోత్రాకు సుమారు 1.7 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇక హర్షాలి ప్రస్తుతం కథక్‌ క్లాసులకు వెళుతోంది. ఇటీవల కథక్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ నుంచి తను బయటకు వస్తుండగా.. కెమెరామెన్లు తమ కెమెరాలను క్లిక్‌ మనిపించారు. దీంతో ఒక్కసారిగా హర్షాలి ఫొటోస్‌, వీడియోలు నెట్టింట వైరలయ్యాయి. తను చాలా అందంగా ఉందంటూ ఫ్యాన్స్‌, నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అలాగే సినిమాల్లోకి ఎప్పుడు వస్తావని ప్రశ్నిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.