Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhola Shankar: భోళాశంకర్‌ నుంచి మెగాస్టార్‌ మరో లీక్‌.. పవన్‌ కల్యాణ్‌ పాటకు స్టెప్పులేసిన చిరంజీవి

వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న చిత్రం భోళా శంకర్‌.. మెహర్‌ రమేశ్‌ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీలో తమన్నా భాటియా హీరోయిన్‌గా నటిస్తుంది. మహానటి కీర్తి సురేష్‌ మెగాస్టార్‌ చెల్లెలిగా కనిపించనుంది. అలాగే సుశాంత్‌ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు.

Bhola Shankar: భోళాశంకర్‌ నుంచి మెగాస్టార్‌ మరో లీక్‌.. పవన్‌ కల్యాణ్‌ పాటకు స్టెప్పులేసిన చిరంజీవి
Megastar Chiranjeevi
Follow us
Basha Shek

|

Updated on: Jul 16, 2023 | 10:07 PM

వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న చిత్రం భోళా శంకర్‌.. మెహర్‌ రమేశ్‌ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీలో తమన్నా భాటియా హీరోయిన్‌గా నటిస్తుంది. మహానటి కీర్తి సురేష్‌ మెగాస్టార్‌ చెల్లెలిగా కనిపించనుంది. అలాగే సుశాంత్‌ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న భోళా శంకర్‌ ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. కాగా భోళాశంకర్‌ నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్స్, గ్లింప్స్‌ , సాంగ్స్‌ ఓ రేంజ్‌లో సెన్సేషన్‌ సృష్టించాయి. మరోవైపు ఈ మూవీకి సంబంధించి ఏదో ఒక న్యూస్‌ లీక్‌ చేస్తూనే ఉన్నారు చిరంజీవి. తాజాగా భోళాశంకర్‌ నుంచి మరో సీన్‌ను లీక్‌ చేశారు మెగాస్టార్‌. కాగా ఈ మూవీలో చిరంజీవి పవన్‌ కల్యాణ్‌ అభిమానిగా నటించనున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడిదే నిజమైంది. తాజాగా రిలీజ్‌ చేసిన వీడియోలో చిరంజీవి పవన్‌ కల్యాణ్‌ను ఇమిటేట్‌ చేశారు. పవన్‌ నటించిన బ్లాక్‌ బస్టర్‌ మూవీ ఖుషి మూవీలోని యే మేరా జహా పాటను అచ్చం పవన్‌ లాగే ఇమిటేట్‌ చేశారు చిరంజీవి. దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో షేర్‌ చేయగా, అది క్షణాల్లోనే వైలర్‌గా మారింది.

‘ఇన్ని రోజులు పవన్ కల్యాణ్‌ తన సినిమాల్లో నన్ను, నా డైలాగులు, నా సాంగ్స్‌కు డ్యాన్స్ చేశాడు. ఇప్పుడు నేను అందరినీ అలరించడానికి భోళా శంకర్‌లో పవన్ మేనరిజమ్‌లను అనుకరిస్తాను. ఆడియెన్స్ వీటిని ఆనందిస్తారని ఆశిస్తున్నాను’ అని ఈ వీడియోలో చెప్పుకొచ్చారు. మెగాభిమానులను భోళాశంకర్‌ వీడియో తెగ ఆకట్టుకుంటోంది. థియేటర్లలో ఈ సీన్‌కి మెగాభిమానులు ఎంజాయ్‌ చేస్తారని, ఇది జస్ట్‌ శాంపిల్‌ మాత్రమే నంటూ చెప్పుకొచ్చారు చిరంజీవి. కాగా ఈ లీక్డ్‌ సీన్‌లో జబర్దస్త్ రష్మీ కూడా కనిపించడం విశేషం.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..