- Telugu News Photo Gallery Cinema photos Allu Arjun Daughter Allu Arha Huge Remuneration For Jr NTR Devara Movie
Allu Arha: ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాలో అల్లు అర్హ! రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
ఇక సమంత నటించిన శాకుంతలం సినిమాతో వెండితెరకు కూడా పరిచయమైంది అర్హ. అందులో తను పోషించిన భరతుడి పాత్ర అందరి ప్రశంసలు అందుకుంది.
Updated on: Jul 16, 2023 | 8:21 PM

అల్లు అర్జున్ గారాల పట్టి అర్లు అర్హకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. స్టార్‌కిడ్‌గా ఇప్పటికే సోషల్ మీడియాలో సినీ సెలబ్రిటీలకు మించి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.

ఇక సమంత నటించిన శాకుంతలం సినిమాతో వెండితెరకు కూడా పరిచయమైంది అర్హ. అందులో తను పోషించిన భరతుడి పాత్ర అందరి ప్రశంసలు అందుకుంది.

ఇప్పుడు మరో పెద్ద సినిమాలోనూ ఛాన్స్ దక్కించుకుంది అర్హ. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తోన్న దేవర అనే సినిమాలో బన్నీ కూతురు నటించనున్నట్లు తెలుస్తోంది.

హీరోయిన్ జాన్వీ కపూర్ చిన్ననాటి పాత్రలో అల్లు అర్హ నటించనుందట. త్వరలోనే దేవర షూటింగ్‌లో తను జాయిన్ కానుందని వార్తలు వస్తున్నాయి.

కాగా సినిమాలో అర్హ పాత్ర కేవలం 10 నిమిషాలే ఉంటుందని, ఇందుకోసం మేకర్స్ ఏకంగా రూ. 20 లక్షల రెమ్యునరేషన్ ఇవ్వనున్నరని టాక్ వినిపిస్తోంది. అంటే నిమిషానికి రూ. 2 లక్షలన్నమాట.




