Vaishnavi Chaitanya: బోనాల జాతరలో బేబీ హీరోయిన్‌.. అమ్మవారికి బంగారు బోణం సమర్పించిన వైష్ణవి చైతన్య

బేబీ హీరోయిన్‌ వైష్ణవి చైతన్య బోనాల ఉత్సవాల్లో సందడి చేసింది. మహంకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించింది. 'నేను ఇక్కడే పాత బస్తీలో పుట్టి పెరిగా. చిన్నప్పటి నుంచే అమ్మవారిని దర్శించుకుంటున్నా...

Vaishnavi Chaitanya: బోనాల జాతరలో బేబీ హీరోయిన్‌.. అమ్మవారికి బంగారు బోణం సమర్పించిన వైష్ణవి చైతన్య
Vaishnavi Chaitanya
Follow us
Basha Shek

|

Updated on: Jul 16, 2023 | 7:11 PM

తెలంగాణలో బోనాల వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం హైదరాబాద్‌లోని పాత బస్తీలో లాల్‌ దర్వాజ బోనాల వేడుకలకు భక్తులు పోటెత్తారు. సామాన్యులతో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు లాల్‌ దర్వాజా మహంకాళి అమ్మవారి ఆలయానికి విచ్చేశారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈక్రమంలో బేబీ హీరోయిన్‌ వైష్ణవి చైతన్య బోనాల ఉత్సవాల్లో సందడి చేసింది. మహంకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించింది. ‘నేను ఇక్కడే పాత బస్తీలో పుట్టి పెరిగా. చిన్నప్పటి నుంచే అమ్మవారిని దర్శించుకుంటున్నా. ఏటా అమ్మానాన్నలతో కలిసి ప్రతి పండగకు ఈ అమ్మవారి ఆలయానికి వస్తాను. బేబీ సినిమా సక్సెస్‌ తర్వాత అమ్మవారికి బోనం సమర్పించడం చాలా అదృష్టంగా భావిస్తున్నా. అమ్మవారి ఆశీస్సులు అందరి మీదా ఉండాలని, మనందరికీ మంచి జరగాలని కోరుకున్నాను’ అని చెప్పుకొచ్చింది వైష్ణవి చైతన్య.

కాగా బేబీ సినిమా విడుదలకు ముందు సికింద్రాబాద్‌ ఉజ్జయిని అమ్మవారికి బోనాల ఉత్సవాల్లో పాల్గొంది వైష్ణవి. అప్పుడు సామాన్య భక్తురాలిలా క్యూలో నిలబడి అమ్మవారిని దర్శించుకున్న ఈ అందాల తార ఇప్పుడు మాత్రం స్పెషల్‌ ఎంట్రీతో మహంకాళి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంది. ఇదే విషయాన్ని అందరితో పంచుకుని మురిసిపోయింది బేబీ హీరోయిన్‌.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.