Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Junior NTR: ‘నెక్ట్స్‌ సీఎం ఎన్టీఆర్‌’ ఫ్లెక్సీలపై రాజకీయ దుమారం.. తారక్ అభిమానుల సంఘం కీలక ప్రకటన

ఒంగోలులో జూనియర్‌ ఎన్టీఆర్‌పై వెలిసిన ఫ్లెక్సీలు రాజకీయంగా దుమారం రేపాయి. నెక్ట్స్‌ సీఎం జూనియర్‌ ఎన్టీఆరే అంటూ గుర్తుతెలియని వ్యక్తులు ఆ ఫ్లెక్సీలను ఏర్పాటుచేశారు. అసలోడు వచ్చేవరకు కొసరోడికి పండగే అన్న కొటేషన్‌ కలిగిన ఆ ఫ్లెక్సీలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.

Junior NTR: 'నెక్ట్స్‌ సీఎం ఎన్టీఆర్‌' ఫ్లెక్సీలపై రాజకీయ దుమారం.. తారక్ అభిమానుల సంఘం కీలక ప్రకటన
Junior Ntr Flexis
Follow us
Basha Shek

|

Updated on: Jul 18, 2023 | 6:21 PM

ఒంగోలులో జూనియర్‌ ఎన్టీఆర్‌పై వెలిసిన ఫ్లెక్సీలు రాజకీయంగా దుమారం రేపాయి. నెక్ట్స్‌ సీఎం జూనియర్‌ ఎన్టీఆరే అంటూ గుర్తుతెలియని వ్యక్తులు ఆ ఫ్లెక్సీలను ఏర్పాటుచేశారు. అసలోడు వచ్చేవరకు కొసరోడికి పండగే అన్న కొటేషన్‌ కలిగిన ఆ ఫ్లెక్సీలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. ఫ్లెక్సీల్లో ఆ క్యాప్షన్‌ చూసిన టీడీపీ కార్యకర్తలు.. వాటిని తొలగించారు. మూడు ప్రధాన సెంటర్లలో ఏర్పాటైన ఫ్లెక్సీలను ఎవరు కట్టారన్నదానిపై ఆరా తీస్తున్నారు. ఒంగోలు అద్దంకి బస్టాండ్‌ సెంటర్‌లో వీటిని అర్ధరాత్రి ఏర్పాటుచేయగా.. అక్కడి సీసీటీవీ ఫుటేజ్‌లో విజువల్స్‌ రికార్డు కాగా.. అందులో కొందరిని గుర్తించారు. జూనియర్‌ ఫ్లెక్సీల ఏర్పాటుకోసం ఐరన్‌ఫ్రేమ్‌లను త్రోవగుంటకు చెందిన వాలంటీర్‌ ఆఫ్రిది ఇచ్చినట్టుగా కనుగొన్నారు. అతన్ని టీడీపీ కార్యకర్తలు నిలదీయగా.. రఘు అనే వ్యక్తి వాటిని తీసుకెళ్లినట్టుగా చెప్పాడు. అయితే ఇదంతా వైసీపీ నేతల పనేనని తెలుగుతమ్ముళ్లు ఆరోపిస్తున్నారు. అటు.. ఫ్లెక్సీల దుమారంపై జూనియర్‌ NTR ఆఫీస్ ఆరా తీస్తోంది. తాము కట్టలేదని ఒంగోలు అభిమాన సంఘం నాయకులు క్లారిటీ ఇచ్చారు. ఫ్లెక్సీలపై పోలీసులకు ఫిర్యాదు చేయబోతున్నారు

మరోవైపు జూనియర్‌ ఎన్టీఆర్ ఫ్లెక్సీలపై RAW NTR TRUST కీలక ప్రకటన చేసింది. ‘మా అభిమానం వివాదాలకు దూరం… ఎలాంటి వివాదాలకు ఫ్యాన్స్‌ స్పందించవద్దు’ అని అభిమానులకు విజ్ఞప్తి చేసింది. ‘ఒంగోలులో గుర్తు తెలియని వ్యక్తులు జూనియర్‌ ఎన్టీఆర్ ఫొటోతో వివాదాస్పద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి RAW NTR TRUST మీద దుష్ప్రచారం జరుగుతుంది. ఈ ఫ్లెక్సీ కి మా RAW NTR సభ్యులకు ఎటువంటి సంబంధం లేదు. మా హీరో చెప్పిన మాటల స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. జూ. ఎన్టీఆర్‌ అభిమానుల తరుపున ఇటువంటి చర్యలను ఖండిస్తున్నాం. ఇటువంటి వివాదాస్పద అంశాలలో మా హీరో గారి పేరుని/ఫొటోని పెట్టవద్దు… అభిమానుల మనోభావాలను దెబ్బతీయవద్దు. జూ. ఎన్టీఆర్ అభిమానులు సంయమనంతో ఉండాలి.. ఇటువంటి వివాదాస్పద అంశాలకు స్పందించవద్దు’ అని ప్రకటనలో పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్ కోసం క్లిక్  చేయండి..

దిగొస్తున్న బంగారం ధర.. త్వరలో తులం రూ. 56వేలు వీడియో
దిగొస్తున్న బంగారం ధర.. త్వరలో తులం రూ. 56వేలు వీడియో
లోకల్​ Vs నాన్​ లోకల్ ఫైట్..కోతుల గుంపుల భీకర యుద్ధం వీడియో
లోకల్​ Vs నాన్​ లోకల్ ఫైట్..కోతుల గుంపుల భీకర యుద్ధం వీడియో
ఏఐతో మానవాళికి తప్పని ముప్పు.. గూగుల్‌ వార్నింగ్‌ వీడియో
ఏఐతో మానవాళికి తప్పని ముప్పు.. గూగుల్‌ వార్నింగ్‌ వీడియో
టఫ్ ఫైట్ లో బరిలోకి దిగిన సిద్దు.. జాక్ హిట్ కొట్టాడా ??
టఫ్ ఫైట్ లో బరిలోకి దిగిన సిద్దు.. జాక్ హిట్ కొట్టాడా ??
ఎనిమిది సినిమాలు చేస్తే ఒక్క హిట్ కూడా పడలేదు..
ఎనిమిది సినిమాలు చేస్తే ఒక్క హిట్ కూడా పడలేదు..
Viral Video: ఇద్దరు పిల్లలు పుట్టినంక ప్రియుడితో భార్య యవ్వారం...
Viral Video: ఇద్దరు పిల్లలు పుట్టినంక ప్రియుడితో భార్య యవ్వారం...
అమ్మవారికి నైవేద్యంగా, భక్తులకు ప్రసాదంగా చైనీస్ వంటలు.. ఎందుకంటే
అమ్మవారికి నైవేద్యంగా, భక్తులకు ప్రసాదంగా చైనీస్ వంటలు.. ఎందుకంటే
ఇదో వంద పడకల ఆస్పత్రి..! కానీ, లోపలికి వెళ్లి చూస్తే మాత్రం..!
ఇదో వంద పడకల ఆస్పత్రి..! కానీ, లోపలికి వెళ్లి చూస్తే మాత్రం..!
స్టార్ హీరోయిన్స్ ముద్దు పేర్లు ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
స్టార్ హీరోయిన్స్ ముద్దు పేర్లు ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
సతీసమేత హనుమంతుడు..! తెలంగాణలో ఈ ప్రత్యేక ఆలయం ఎక్కడుందో తెలుసా?
సతీసమేత హనుమంతుడు..! తెలంగాణలో ఈ ప్రత్యేక ఆలయం ఎక్కడుందో తెలుసా?