AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijayawada: కాలువలో వరుసగా కొట్టుకొస్తున్న శవాలు.. ఏపీలో కలకలం రేపుతోన్న గుర్తు తెలియని డెబ్ బాడీలు.

కృష్ణా జిల్లా పరిధిలో బందరు కాలువ పొడువున ఒకేరోజు మూడు మృతదేహాలు కొట్టుకురావడం కలకలం రేపింది. నిన్న కాలువలో కారులో గల్లంతైన అవనిగడ్డకు చెందిన రత్న భాస్కర్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టడంతో బంధరు కాలువలో గంటల వ్యవధిలోనే ఒక్కోక్క మృత దేహం కొట్టుకొచ్చింది. దీనితో పోలీసులు అటు మృత దేహాలను బయటకు...

Vijayawada: కాలువలో వరుసగా కొట్టుకొస్తున్న శవాలు.. ఏపీలో కలకలం రేపుతోన్న గుర్తు తెలియని డెబ్ బాడీలు.
Representative Image
P Kranthi Prasanna
| Edited By: Narender Vaitla|

Updated on: Jul 18, 2023 | 6:39 PM

Share

విజయవాడ, జులై 18: కృష్ణా జిల్లా పరిధిలో బందరు కాలువ పొడువున ఒకేరోజు మూడు మృతదేహాలు కొట్టుకురావడం కలకలం రేపింది. నిన్న కాలువలో కారులో గల్లంతైన అవనిగడ్డకు చెందిన రత్న భాస్కర్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టడంతో బంధరు కాలువలో గంటల వ్యవధిలోనే ఒక్కోక్క మృత దేహం కొట్టుకొచ్చింది. దీనితో పోలీసులు అటు మృత దేహాలను బయటకు తీసుకొని రాలేక అలా అని వాటిని వదిలేయలేక తలలు పట్టుకుంటున్నారు. అయితే మృత దేహాలు ఎక్కడ నుంచి వస్తున్నాయనే వాటికి పోలీసులు కూడా సమాధానం చెప్పలేక పోతున్నారు.కాలువలో కొట్టుకొస్తున్న మృత దేహాలు మొత్తం గుర్తు పట్టలేనంత మారిపోయి దుర్గంధం వెదజల్లుతు కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో పోలీసులకు ఇవి సవాల్గా మారుతున్నాయి.

అయితే కాలువలో కొట్టుకోస్తున్న మృత దేహాలు మొత్తం వ్యవహారంలో బాధితులు ఎవ్వరూ అనేది కూడా అంతుచిక్కని ప్రశ్నలుగా ఉన్నాయి.విజయవాడ నుంచి మొదలు కొన్ని కిలోమీటర్ల మేర పారుతున్న కాలువలో ఈ మృత దేహాలు ఎక్కడి నుంచి వచ్చాయి ఎవరైనా హత్య చేశారా లేక ఆత్మహత్య చేసుకున్నారా లేదా ప్రమాదవశాత్తు జరిగిన మరణాల అనేవి మిస్టరీగా మారాయి. అయితే కాలువ వెంబడి ఉండే గ్రామాల ప్రజలు మాత్రం ఇటీవల కాలంలో వరుసగా మృత దేహాలు విజయవాడ శివారు ప్రాంతాలు నుంచి అవనీగడ్డ వరకు ఎక్కడో ఒకచోట రోజూ మృత దేహాలు కనిపిస్తాయని అంటున్నారు. ముఖ్యంగా చోడవరం, పులిపాక , సమీప గ్రామాలు లంకల పరిధిలోనే ఎక్కువగా నీళ్లు దిగువకు వదిలిన ప్రతిసారి కొట్టుకొస్తున్నాయని తాము వాటిని బయాందోళనకు గురవుతున్నామని అంటున్నారు.

అయితే డెడ్ బాడీస్ కనిపించిన ప్రతిసారి పోలీసులకు సమాచారం ఇచ్చినా ఇటువైపు కన్నెత్తి కూడా చూడరని వ్యవసాయ పనులకు ,లేదా కాలువలు దాటెప్పుడు మృత దేహాలను చూసి భయపడుతున్నామని అంటున్నారు. ఈ ఒక్కరోజే మూడు మృత దేహాలు కాలువలో కనిపించగా ఇలా నీళ్లు దిగువకు వదిలిన ప్రతిసారి వారంలో కనీసం రెండు సార్లు ఇలా మృత దేహాలు కొట్టుకొస్తయని సమీపంలోని గ్రామాల ప్రజలు అంటున్నారు. మృత దేహాలు ఇలా కాలువలో కొట్టుకొస్తున్న వీటి విషయంలో పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనీ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

విజయవాడతో మొదలై మొత్తం 5 పోలీస్‌ స్టేషన్ల పరిధిలో ముడిపడి ఉండటంతో తమకెందుకు వచ్చిన సమస్య అని ఎవరికి వారు చేతులు దులుపుకుంటున్నారు. ప్రత్యేకమైన కేసులు లేదా వివాదాస్పదం అయితే తప్ప అటు వైపు కన్నెత్తి చూడలేని పరిస్థితి ఉంది. ఒకవేళ ఏ పోలీస్‌ స్టేషన్ పరిధిలో అయిన కాలువలో మృత దేహం కొట్టుకొస్తే దానిని బయటకు తీయడం దగర నుంచి దహన సంస్కారాలు చేసే వరకు ఆ పోలీసులకు తలనొప్పిగా మారింది. మృత దేహాన్ని గుర్తించ లేకపోవడం పైగా మిస్సింగ్ కేసులు ఎక్కడా లేకపోవడంతో వీటిని తమ స్టేషన్ పరిధిలో కేసులు నమోదు చేయడం విచారణ చేయడం ఎందుకని భావించి కాలువలో కొట్టుకుపోతున్న వాటిని అలాగే చూసి చూడనట్లు వదిలేస్తున్నారు.

పైగా మృత దేహాలను బయటకు తీయాలన్న వాటిని ఆసుపత్రికి తరలించాలన్నా ఖర్చుతో కూడుకున్నది కావడం పైగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్న వాటిని తీసేందుకు ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో పోలీసులు స్వయంగా వాటిని చూసి చూడనట్లు మన పరిధిలోకి వచ్చింధి కాదని వదిలేస్తున్నారు. మరోవైపు ఇలా కాలువల్లో కొత్తుకొస్తున్న మృత దేహాల విషయంలో వాస్తవాలు తేల్చాలని ప్రజలు కోరుతున్నారు. మృతదేహాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్లంతా ఎవరు.? సహజ మరణాల లేక హత్యల ఆన్న అంశాలు తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..