Hyderabad: ఫలక్‌నూమా ప్రమాదం వెనక నిజమిదే..? లెటర్ రాసిన వ్యక్తి నుంచి పోలీసులు ఏం రాబట్టారు..? వివరాలివే..
Falaknuma Express Accident: ఫలక్‌నూమ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని ప్రాథమికంగా రైల్వే పోలీసులతో పాటుగా క్లూస్ టీం ఒక అంచనాకు వచ్చినప్పటికీ అసలు ఈ ప్రమాదం వెనకాల ఏం జరిగిందన్న ఇన్వెస్ట్రేషన్ ఇంకా కొనసాగుతూనే..
ప్రమాదానికి సరిగ్గా వారం రోజుల ముందుగానే బాలాసూర్ ట్రైన్ యాక్సిడెంట్(ఒడిశా ఘటన) తరహాలోనే అదే రూట్లో మరొక రైలు ప్రమాదం జరుగుతుందని వచ్చిన లెటర్‌ని పోలీసులు చాలా సీరియస్‌గా తీసుకొని దర్యాప్తు చేశారు. రాసిన వ్యక్తి రామచంద్రపురం ఏరియాకి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఆ లెటర్ రాసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లిమిట్స్‌లోని రామచంద్రపురం పిఎస్‌లో నివాసం ఉంటున్న ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మాదాపూర్ ఎస్ఓటి పోలీసులు చాకచక్యంగా యువకుని అదుపులోకి తీసుకున్నారు.
అయితే ఫలక్‌నూమ ఎక్స్‌ప్రెస్ అగ్నిప్రమాదం వెనకాల ఇతని ప్రమేయం లేనట్టుగా పోలీసులు తేల్చారు. కేవలం సెన్సేషన్ చేయాలన్న ఉద్దేశంతోనే ఆ వ్యక్తి లెటర్ రాసినట్టుగా పోలీసులు తేల్చారు. ఈ క్రమంలో క్లూ టీమ్, రైల్వే శాఖ నమ్ముతున్న ప్రాథమిక రిపోర్టే నిజమా..? లేక దీని వెనుక మరేదైనా కారణం ఉందా అనేది తెలియాలంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే..