Hyderabad: హుస్సేన్ సాగర్ నీటిపై నడవాలి అనుకుంటున్నారా..? అయితే త్వరలోనే మీ కల నెరవేరబోతోంది..
Hussain Sagar Lake: అమరవీరుల స్థూపం, సెక్రటేరియట్, భారీ అంబేద్కర్ విగ్రహంతో సాగర్ అందాలు అలరారుతున్నాయి. వీటికి మరొక స్పెషల్ అట్రాక్షన్ యాడ్ కాబోతుంది. అదే మాస్కోలోని వేలాడే బ్రిడ్జ్ మాదిరి హుస్సేన్ సాగర్ లో తేలియాడే వంతెనను నిర్మించారు.
హైదరాబాద్, జూలై 19: హైదరాబాద్‌లో ప్రముఖ పర్యాటక కేంద్రం హుస్సేన్ సాగర్. సిటి టూరిస్టులు తమ విజిటింగ్ ప్లేసెస్ లిస్ట్ లో ఈ భారీ సరస్సును తప్పనిసరిగా చెర్చుకుంటారు. దీంతో సాగర్ అందాలను మరింత పెంచేందుకు ప్రభుత్వం శ్రద్ధ పెట్టింది. హైదరాబాద్ హుస్సేన్ సాగర్ చుట్టూ టూరిస్ట్ సర్క్యూట్ గా చేయడం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది హెచ్ఎండిఏ. ఇప్పటికే హుస్సేన్ సాగర్ చుట్టు ఆకట్టుకునే నిర్మాణాలు, పార్కులతో జనసందడి నెలకొంటుంది. దీనికి మరో అద్భుత ఆకాశ మార్గం సిద్ధం అవుతోంది. సాగర్ జలాల్లో తేలియాడే వంతెన నిర్మాణం చేపట్టారు. లెక్ డక్ పార్కు డెవలప్ మెంట్ లో భాగంగా ఈ భారీ వంతెన హుస్సేన్ సాగర్ నీటిలో తేలియాడుతోంది. నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ హైదరాబాద్ ఐకానిక్ అని చెప్పాలి. ఇక దాని చుట్టూ అంతా పర్యాటక ప్రసిద్ధి చెందిన ప్రాంతమే. అందుకే ప్రభుత్వం ఇటీవల ట్యాంక్ బండ్ తో పాటు పరిసరాలను 40 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసింది.
రీసెంట్ గా ఎన్టీఆర్ మార్గ్ లో ఫార్ములా-ఈ కార్ రేసింగ్ సందర్భంగా సాగర్ లో నీటిలో తేలియాడే మ్యూజికల్ వాటర్ ఫౌంటెన్ ఏర్పాటు చేసారు. 90మీటర్ల ఎత్తుకు నీరు వెళ్లే… ఈ ఫౌంటెన్‌లో 3సెట్ల లేజర్ ఉండి వివిధ థీమ్‌లతో షో ఆకట్టుకుంది. అయితే కొత్త సచివాలయం ఎదురుగా ఉన్న దానిని పీవీ నర్సింహారావు మార్గ్ (నెక్లెస్ రోడ్) వైపు మారుస్తున్నారు. అమరవీరుల స్థూపం, సెక్రటేరియట్, భారీ అంబేద్కర్ విగ్రహంతో సాగర్ అందాలు అలరారుతున్నాయి. వీటికి మరొక స్పెషల్ అట్రాక్షన్ యాడ్ కాబోతుంది. అదే మాస్కోలోని వేలాడే బ్రిడ్జ్ మాదిరి హుస్సేన్ సాగర్ లో తేలియాడే వంతెనను నిర్మించారు.
జలవిహార్ పక్కన లెక్ డక్ పార్క్ పేరుతో ఈ పర్యాటక ప్రాంతాన్ని డెవలప్ చేస్తున్నారు. ఇందులోకి వచ్చిన వారు సాగర్ లోని జలలాపైకి వెళ్లి దానిపైన నడిచిన అనుభూతి వచ్చేలా పార్కును సిద్దం చేస్తున్నారు. ఈ తేలియాడే వంతెన కోసం 10కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేస్తోంది హెచ్ఎండిఏ. ఇలాంటి పార్కును హైదరాబాద్ లో మొదటి సారి ఎర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టు కు సంబందించి వేలాడే వంతెన నిర్మాణం దాదాపు పూర్తి కావొచ్చొంది. కాషాయ కలర్ లోని వంతెన ఎంటా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
పార్క్ డెవలప్ మెంట్ పూర్తి అయితే త్వరలోనే దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. ఇలా సాగర్ చుట్టు మొత్తంగా ఒక టూరిస్ట్ సర్య్కూట్ ఎర్పాటు చేస్తోంది ప్రభుత్వం. గ్రేటర్ వాసులే కాదు సిటీకి వచ్చే పర్యాటకులు ఉదయం నుంచి రాత్రి వరకు సాగర్ చెంత సేద తీరేలా టూరిజం స్పాట్ ను తీర్చిదిద్దుతున్నారు. ఈ తేలియాడే వంతెన ప్రారంభమైతే సాగర్ జలాలపై నడచి సరికొత్త అనుభుతితో ఇంటికి వెళ్లొచ్చు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం