AP Politics: పంతం నీదా.. నాదా.. ఆత్మీయ సమ్మేళనాల పేరుతో పార్టీలో విభేదాలు సృష్టిస్తున్నారు.. తోట కుటుంబంపై ఎమ్మెల్యే చంటిబాబు వర్గీయుల ఆగ్రహం..

Kakinada District News: ఎమ్మెల్యే చంటిబాబుకీ, మాజీ మంత్రి తోట నరసింహంకీ మధ్య విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి జగ్గంపేట నుంచి పోటీ చేయాలని భావిస్తున్న తోట నరసింహం.. దానికోసం ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్‌ చేస్తున్నారు. గ్రామాల్లో ఆత్మీయ సమ్మేళనాల పేరుతో క్యాడర్‌కి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు.

AP Politics: పంతం నీదా.. నాదా.. ఆత్మీయ సమ్మేళనాల పేరుతో పార్టీలో విభేదాలు సృష్టిస్తున్నారు..  తోట కుటుంబంపై ఎమ్మెల్యే చంటిబాబు వర్గీయుల ఆగ్రహం..
Differences Between Mla Cha
Follow us

|

Updated on: Jul 16, 2023 | 1:13 PM

కాకినాడ, జూలై: జగ్గంపేట వైసీపీలో సీటు ఫైట్ ముదురుతోంది. ఎమ్మెల్యే చంటిబాబుకీ, మాజీ మంత్రి తోట నరసింహంకీ మధ్య విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి జగ్గంపేట నుంచి పోటీ చేయాలని భావిస్తున్న తోట నరసింహం.. దానికోసం ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్‌ చేస్తున్నారు. గ్రామాల్లో ఆత్మీయ సమ్మేళనాల పేరుతో క్యాడర్‌కి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పరిణామాలపై ఎమ్మెల్యే చంటిబాబు ఆగ్రహంగా ఉన్నారు. నరసింహం ఆత్మీయ సమ్మేళనాలు పెట్టడం ఒక ఎత్తయితే.. అందులో ఎమ్మెల్యే వర్గీయుల్ని టార్గెట్‌ చేస్తుండడం మరో ఎత్తు. సరిగ్గా ఇక్కడే రెండు వర్గాల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి.

రాజకీయాలు ఇప్పటివరకూ ఒక లెక్క.. ఇకపై మరో లెక్క అంటూ తోట నరసింహం తనయుడు రాంజీ ఘాటు వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. అదే ఫ్లోలో.. కొంతమంది వైసీపీ నేతలు బ్రోకర్లు అని కామెంట్‌ చేయడం కూడా చర్చనీయాంశమైంది. అటు, తోట కుటుంబంపై ఎమ్మెల్యే చంటిబాబు వర్గీయుల ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆత్మీయ సమ్మేళనాలతో పార్టీలో విభేదాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.

బ్రోకర్ కామెంట్లపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామంటున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఇప్పటికే ప్రత్తిపాడు, పెద్దాపురం నియోజకవర్గాల్లో నేతల మధ్య విభేదాలున్నాయి. వచ్చే ఎన్నికల్లో పోటీ కోసం నేతల మధ్య పోటీ నెలకొంది. ఇప్పుడు జగ్గంపేటలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తుండడం అధిష్టానానికి తలనొప్పిగా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం