AP High Court Jobs: జులై 18 నుంచి జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలకు ధ్రువపత్రాల పరిశీలన

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లా కోర్టుల్లో పలు ఉద్యోగాల ఎంపిక ప్రక్రయలో భాగంగా ధ్రువపత్రాల పరిశీలనకు సంబంధించిన తేదీలు విడుదలయ్యాయి. ఆయా ఉద్యోగాలకు ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 18 నుంచి ధ్రువపత్రాల పరిశీలన..

AP High Court Jobs: జులై 18 నుంచి జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలకు ధ్రువపత్రాల పరిశీలన
AP High Court
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 16, 2023 | 1:17 PM

అమరావతి, జులై 16: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లా కోర్టుల్లో పలు ఉద్యోగాల ఎంపిక ప్రక్రయలో భాగంగా ధ్రువపత్రాల పరిశీలనకు సంబంధించిన తేదీలు విడుదలయ్యాయి. ఆయా ఉద్యోగాలకు ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 18 నుంచి ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నట్లు హైకోర్టు ప్రకటించింది. దాదాపు 3,546 ఉద్యోగాల భర్తీకి గతేడాది హైకోర్టు నోటిపికేషన్లు ఇచ్చిన సంగతి తెలిసిందే.

గుంటూరు, ప్రకాశం, తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి మొదటి జాబితాలో ఎంపికైన కొందరు అభ్యర్థుల పేర్లు రెండో జాబితాలోనూ ఉండటంతో వాటిని సరిచేస్తూ తాజాగా మరో జాబితా విడదల చేసింది. వివిధ విభాగాల్లో ఉద్యోగాలకు ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థులకు జులై 18 నుంచి 31 ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నట్లు తెలియజేస్తూ ఏపీ హైకోర్టు అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఆయా తేదీల్లో సంబంధిత జిల్లాల్లోని ప్రిన్సిపల్‌ డిస్ట్రిక్ట్‌ జడ్జెస్‌ కోర్ట్స్‌ పరిధిలో ధ్రువపత్రాల పరిశీలన చేపడుతారు. ధ్రువపత్రాల పరిశీలన అనంతరం ఉద్యోగ నియామక పత్రాలు అందజేయనున్నారు. ఏయే తేదీల్లో ఏయే పోస్టులకు ధ్రువపత్రాల పరిశీల ఉంటుందంటే..

ఇవి కూడా చదవండి
  • స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌-3, డ్రైవర్‌ ఉద్యోగాలకు జులై 18వ తేదీన
  • జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు జులై 19వ తేదీన
  • ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్‌ ఉద్యోగాలకు జులై 20వ తేదీన
  • రికార్డ్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలకు జులై 21వ తేదీన
  • ప్రాసెస్‌ సర్వర్ ఉద్యోగాలకు జులై 22, 24 తేదీల్లో
  • ఆఫీస్‌ సబార్డినేట్‌ ఉద్యోగాలకు జులై 26, 31 తేదీల్లో

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.