- Telugu News Photo Gallery Business photos Why don’t women in Americans wear gold, Do you know the price of gold there
Gold Price Today: బంగారం తక్కువగా వినియోగించే అమెరికాలో గోల్డ్ ధరలు ఎంత ఉందో తెలుసా..
Gold Price Today in USA: ఇండియా, పాకిస్థాన్ లేదా దుబాయ్‌లో బంగారం ధరకు సంబంధించి చాలా రకాల రిపోర్టులు విని ఉంటారు. అయితే అమెరికాలో బంగారం ధరలు ఎలా ఉంటాయో మీకు తెలుసా..
Updated on: Jul 17, 2023 | 4:17 PM

ముందుగా భారతదేశంలో బంగారం ధరలు ఏంటో మనం తెలుసుకుందాం. తద్వారా అమెరికాలో బంగారం చౌకగా ఉందా.. లేదా ఖరీదైనదా.. అనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకుందాం. ప్రస్తుతం భారతదేశంలో బంగారం ధర రూ.60 వేల 975 ఉంది.

అమెరికాలో ఈ ధర 650 డాలర్లు. అంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం కొనుగోలు చేస్తే $ 650 డాలర్లను చెల్లించాలి. అదే మనం దేశంలో లెక్కల ప్రకారం రూ. 53,350 అవుతుంది.

అదే సమయంలో, 22 క్యారెట్ల బంగారం ధర 600 అమెరికన్ డాలర్లు, ఇది భారతదేశంలో దాదాపు రూ. 49 వేల ఉంటుంది.

ఇతర దేశాల కంటే చైనా, భారత్‌లో బంగారు నగల వినియోగం చాలా ఎక్కువ.

ఆభరణాలకు సంబంధించిన బంగారం డిమాండ్ వివాహ ఆచారాల వంటి సంప్రదాయాల మీద ఆధారపడి ఉంటుంది.

అదే సమయంలో, భారతీయులు దుబాయ్ నుంచి బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతారు. కానీ అక్కడ బంగారం ధర మాత్రం పెద్దగా హెచ్చ తగ్గులు లేవు.





























