- Telugu News Photo Gallery Business photos UIDAI's rolls out new Aadhaar services on its toll free number: Details Here
Aadhaar: ఒక్క ఫోన్‌కాల్‌తో మీ ‘ఆధార్’ గురించి ఇట్టే తెలుసుకోవచ్చు.. UIDAI సేవలు ఇలా ఈజీగా పొందండి..
Aadhaar services: దేశంలో ఆధార్ కార్డు లేకుండా ఏ పని జరగదు.. ఇప్పుడు ఆన్లైన్, లేదా ఆఫ్లైన్.. బ్యాంకు లేదా ప్రభుత్వ.. ప్రైవేటు రంగం ఇలా అన్ని కార్యకలాపాల్లోనూ ఆధార్ కార్డు తప్పనిసరిగా మారింది. ఈ క్రమంలో ఆధార్ కి సంబంధించిన విషయాలను సులువుగా తెలుసుకునేందుకు..
Updated on: Jul 17, 2023 | 1:50 PM

Aadhaar services: దేశంలో ఆధార్ కార్డు లేకుండా ఏ పని జరగదు.. ఇప్పుడు ఆన్లైన్, లేదా ఆఫ్లైన్.. బ్యాంకు లేదా ప్రభుత్వ.. ప్రైవేటు రంగం ఇలా అన్ని కార్యకలాపాల్లోనూ ఆధార్ కార్డు తప్పనిసరిగా మారింది. ఈ క్రమంలో ఆధార్ కి సంబంధించిన విషయాలను సులువుగా తెలుసుకునేందుకు.. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI).. IVRS ద్వారా సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (Meity) ఆధ్వర్యంలో UIDAI ఆధార్ కార్డును మంజూరు చేస్తుంది. అయితే, ఆధార్ చట్టం - 2016 కింద.. ఆధార్ స్థితిగతులను తెలుసుకునేందుకు కేంద్రం పలు సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. నోడల్ ఆధార్ జారీ చేసే అధికారంతోపాటు అనేక రకాల సేవలను అందించే టోల్-ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

UIDAI టోల్ ఫ్రీ నంబర్ 1947. అథారిటీ దీనిని 2016 సంవత్సరంలో ప్రవేశపెట్టింది. ఈ టోల్-ఫ్రీ నంబర్ 24/7 అందుబాటులో ఉంటుంది. ఈ సంవత్సరం ప్రారంభంలో, UIDAI ఈ టోల్ ఫ్రీ నంబర్‌లో అనేక కొత్త సేవలను అందుబాటులోకి తెచ్చింది.

దీనిద్వారా మీ ఆధార్ నమోదు/అప్‌డేట్ స్థితిని తెలుసుకోవచ్చు.. మీ ఆధార్ PVC కార్డ్ స్థితి, మీ ఆధార్ ఫిర్యాదు స్థితి, ఆధార్ నమోదు కేంద్రాన్ని గుర్తించడం, SMS ద్వారా ఆధార్, సంబంధిత సేవల గురించి సమాచారాన్ని పొందవచ్చు.

UIDAI ద్వారా IVRSలో నిర్మించిన కొత్త సేవల కోసం UIDAI టోల్-ఫ్రీ నంబర్ 1947.. కాల్ చేసి వారి ఆధార్ నమోదు లేదా అప్‌డేట్ స్థితి, PVC కార్డ్ స్థితిని తెలుసుకోవడానికి లేదా SMS ద్వారా సమాచారాన్ని స్వీకరించవచ్చు అని యూఐడీఏఐ ట్వీట్ చేసింది.

చాట్‌బాట్ ఆధార్ మిత్ర: నవంబర్ 2022లో, UIDAI తన కొత్త కృత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్ ఆధారిత చాట్‌బాట్ 'ఆధార్ మిత్ర'ను కూడా ప్రారంభించింది. ప్రజలు తమ ఆధార్ కార్డ్ సంబంధిత ప్రశ్నలకు సమాధానాలు పొందడంలో సహాయపడటానికి ఆధార్ మిత్ర చాట్‌బాట్ ప్రారంభించింది. దీనిద్వారా ఫిర్యాదు చేయడంతోపాటు.. ఫిర్యాదు స్థితిని కూడా తనిఖీ చేయవచ్చు.





























