AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అంతుచిక్కని రత్నభాస్కర్ డెత్ మిస్టరీ..! పోలీసులకు సవాలుగా కేస్.. కరకట్టపై అసలేం జరిగింది..?

Krishna District: కృష్ణా జిలాల్లో సంచలనం సృష్టించిన విజయవాడ అవనిగడ్డ కరకట్ట కార్ ప్రమాదంలో మరణించిన రత్న భాస్కర్ డెత్ మిస్టరీ పోలీసులకు ఒక సవాలుగా మారింది. ఆదివారం అర్ధరాత్రి కాలువలోకి దూసుకెళ్లిన కార్ ను ఉదయమే గుర్తించిన పోలీసులు రత్న భాస్కర్ ప్రాణాలతో బయటపడ్డాడేమో..

అంతుచిక్కని రత్నభాస్కర్ డెత్ మిస్టరీ..! పోలీసులకు సవాలుగా కేస్.. కరకట్టపై అసలేం జరిగింది..?
Ratna Bhaskar
P Kranthi Prasanna
| Edited By: శివలీల గోపి తుల్వా|

Updated on: Jul 20, 2023 | 12:26 PM

Share

కృష్ణా జిల్లా న్యూస్, జూలై 20: కృష్ణా జిలాల్లో సంచలనం సృష్టించిన విజయవాడ అవనిగడ్డ కరకట్ట కార్ ప్రమాదంలో మరణించిన రత్న భాస్కర్ డెత్ మిస్టరీ పోలీసులకు ఒక సవాలుగా మారింది. ఆదివారం అర్ధరాత్రి కాలువలోకి దూసుకెళ్లిన కార్ ను ఉదయమే గుర్తించిన పోలీసులు రత్న భాస్కర్ ప్రాణాలతో బయటపడ్డాడేమో అని భావించారు. ఇతర కారణాలతో సృష్టించిన యాక్సిడెంట్ ఏమో అని అనుమానించారు. కానీ మరుసటి రోజే అనుమానాస్పదంగా కార్ ప్రమాదానికి గురైన ప్రదేశం నుండి 12 కిలోమీటర్ల దూరంలో వివస్త్రుడై ఒంటిపై బట్టలు లేకుండా గాయాలతో దారుణమైన స్థితిలో రత్న భాస్కర్ డెడ్ బాడీ గుర్తించిన పోలీసులు అనుమానాస్పద మృతిగా కేస్ నమోదు చేసి దర్పాప్తు చెయ్యటం ప్రారంభించారు.

పోలీసుల దర్యాప్తులో ఈ కేస్ లో ఎలాంటి ఆధారాలు దొరకక పోవటం మరింత ఛాలెంజ్ గా మారింది. ఇక ప్రమాదానికి గురైన కార్ ఒక వైపు నుండి వాస్తు ఇంకో వైపు పడిపోవటం ,కార్ పూర్తిగా నీటిలో ముణగకపోవటం ,కార్ కీస్ కనిపియ్యకపోవటం,కార్ లో మృతుడి ఫోన్ ,ఒక జత బట్టలు ఉండటం. రత్నభాస్కర్ ఒంటిపై ఎలాంటి బట్టలు లేకపోవటం ఇది ప్రమాదం కాదు ఎవరో సృష్టించారు అనేది అర్ధం అవుతున్న టెక్నీకల్ గా ఎలాంటి ఆధారాలు సేకరించలేకపోతున్నారు పోలీసులు. ఇప్పటి వరకు ఒంటరిగా కార్ లో వెళ్తున్నట్లు రికార్డ్ అయినట్లు దృశ్యాలు మాత్రమే గుర్తించిన పోలీసులకు దాని వాళ్ళ పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. ప్రమాదం జరిగిన చోట ఎలాంటి కెమెరాలు లేకపోవటం కాల్ డేటా ఏరైస్ అయ్యి ఉండటం తో కట్టపై ఎం జరిగి ఉంటుందనేది అంచనా వేయలేకపోతున్నారు పోలీసులు.

మరో పక్క రత్న భాస్కర్‌తో ఉండాల్సిన 5 లక్షలు కనిపించటంలేదని, ఇది హత్య అంటూ ఆరోపిస్తున్నారు కుటుంబసభ్యులు. అలాగే మూడు బృందాలుగా ఈ కేస్ ను దర్యాప్తు చేస్తున్న పోలీసులు రత్న భాస్కర్ ఆర్థిక లావాదేవీలు ,కట్టవైపుకు వచ్చే ప్రభుత్వ ,ప్రైవేట్ సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఏదైనా ఇల్లీగల్ ఎఫ్ఫైర్ ఉందా అనే అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..