AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కృష్ణానది తీరాన వజ్రాల అన్వేషణ.. రాళ్లలోని రత్నాల కోసం ఉరకలు పెడుతున్న పరివాహక ప్రాంతవాసులు..

Krishna District: వర్షాలు భారీగా కురుస్తున్నాయి.. కృష్ణానది పరివాహక ప్రాంతం పచ్చదనాన్నిపరుచుకున్నాయి. దింతో కొండంత ఆశతో ప్రజలు గుడిమెట్ల కొండకు బారులు తిరుతున్నారు. స్థానిక ప్రజలే కాదు.. దూర ప్రాంతాల వారు రెక్కలు కట్టుకొని గుడిమెట్ల ప్రాంతానికి వాలిపోతున్నారు. ఓలంతా కళ్ళు చేసుకొని..

కృష్ణానది తీరాన వజ్రాల అన్వేషణ.. రాళ్లలోని రత్నాల కోసం ఉరకలు పెడుతున్న పరివాహక ప్రాంతవాసులు..
Diamonds searching
M Sivakumar
| Edited By: శివలీల గోపి తుల్వా|

Updated on: Jul 20, 2023 | 12:49 PM

Share

కృష్ణా జిల్లా న్యూస్, జూలై 20: వర్షాలు భారీగా కురుస్తున్నాయి.. కృష్ణానది పరివాహక ప్రాంతం పచ్చదనాన్నిపరుచుకున్నాయి. దింతో కొండంత ఆశతో ప్రజలు గుడిమెట్ల కొండకు బారులు తిరుతున్నారు. స్థానిక ప్రజలే కాదు.. దూర ప్రాంతాల వారు రెక్కలు కట్టుకొని గుడిమెట్ల ప్రాంతానికి వాలిపోతున్నారు. ఓళ్లంతా కళ్ళు చేసుకొని మరి వేట కొనసాగిస్తున్నారు. ఇంతకీ వారంతా ఎందుకు గుడిమెట్ల దారి పట్టారు..? వర్షాలు పడితే చాలు కొండప్రాంతాలు పచ్చదనాన్ని పంచుకుంటాయి. కొండల పై నుండి నీరు జాలువారుతుంది. మట్టి వెదజల్లి మంచి సువాసన వెదజల్లుతుంది. ఇలాంటి వాతావరణమే అక్కడి వారు కోరుకునేది. కృష్ణానది పరివాహక ప్రాంతంలోని గుడిమెట్ల కొండ ప్రాంతం ఇప్పుడు కొత్తగా కనిపిస్తుంది. దింతో ఆ ప్రాంతానికి ప్రజలు బారులు కడుతున్నారు. కృష్ణా , గుంటూరు , ఖమ్మం , నల్గొండ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఏదో జాతర చూడడానికో.. సంబరానికి హాజరు కావడానికి కాదు.. అక్కడ విలువైన వజ్రాలు దొరుకుతాయని ఆశతో పరుగులు పెడుతున్నారు.

కొండలపై వజ్రాల వేట కోసం వచ్చిన ప్రజలు ఏదో పోగొట్టుకున్న వస్తువుల కోసం గాలిస్తున్నట్టు కొండపై గుంపులు గుంపులుగా అమూల్యమైన వజ్రాల కోసం అన్వేషిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంచు కూడా వదలకుండా నేలనుజల్లెడ పడుతున్నారు. చినుకులు పడటంతో బయటకు వచ్చే వజ్రపు తునకల కోసం వారంతా వేట కొనసాగిస్తూ వారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఎన్టీఆర్ జిల్లా కొండ ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి అంటే చాలు వజ్రాల వేట కొనసాగుతుంది. కొన్ని రోజులుగా జిల్లాలో వర్షాలు కురవడంతో చిన్న, పెద్ద, ముసలిముతకతో పాటు అందరూ నందిగామ , చందర్లపాడు మండలంలోని గుడిమెట్ల కొండపై వాలిపోతున్నారు. రాళ్లలో రతనాల కోసం అన్వేషణ మొదలుపెట్టారు. ఇప్పుడు గుడిమెట్ల కొండపై ఎక్కడ చూసినా జనమే జనం. కంటికి కనపడిన ప్రతి రాయిని పట్టి పట్టి చూస్తూ. వజ్రపు తునకల కోసం వేటాడుతున్నారు.

గుడిమెట్ల ప్రాంతంలో వజ్రాలను వెతుకుతున్న స్థానికులు, స్థానికేతరులు..

ఇవి కూడా చదవండి

ఇంకా ఆదివారం వచ్చిందంటే చాలు కొందరు సరదా కోసం కూడా ఈ ప్రాంతానికి వచ్చి వేట కొనసాగిస్తున్నారు. వచ్చినవారు వజ్రాలు దొరికాయా సరే.లేదంటే పిక్నిక్ కి వచ్చామనుకుంటామని చెప్తున్నారు. గతంలో కృష్ణానది తీర ప్రాంతంలోని కొండల్లో రత్నాలు దొరికాయి. రాత్రికి రాత్రి లక్షాధికారులైన వారు కూడా ఉన్నారు. అందుకే డైమండ్ హంట్ ఇక్కడ క్రేజ్ గా మారిపోయింది. స్థానిక ప్రజలే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి స్థావరాలు ఏర్పాటు చేసుకొని వేట కొనసాగిస్తున్నారు. ఒక్క వజ్రం దొరికితే చాలు. తమ తలరాతలు మారిపోతాయని ప్రతి ఒక్కరూ వజ్రాల కోసం వేట కొనసాగిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..