Andhra Pradesh: అరాచకానికి పరాకాష్ట.. పేరెంట్స్‌తో ఫోన్‌లో మాట్లాడిందని టీ.సీ ఇచ్చి పంపిన స్కూల్ ప్రిన్సిపాల్..
కొన్ని విద్యాసంస్థలు విద్యార్థుల పట్ల అమానుషంగా వ్యవహరిస్తున్నాయి. చిన్న చిన్న తప్పులకే పెద్ద పెద్ద శిక్షలు విధిస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. ఉపాధ్యాయుల పర్మిషన్ తీసుకోకుండా విద్యార్థిని తన పేరెంట్స్‌తో సెల్‌ఫోన్లో మాట్లాడిందని టీ.సీ ఇచ్చి పంపించేశారు స్కూల్ ప్రిన్సిపాల్.

కొన్ని విద్యాసంస్థలు విద్యార్థుల పట్ల అమానుషంగా వ్యవహరిస్తున్నాయి. చిన్న చిన్న తప్పులకే పెద్ద పెద్ద శిక్షలు విధిస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. ఉపాధ్యాయుల పర్మిషన్ తీసుకోకుండా విద్యార్థిని తన పేరెంట్స్‌తో సెల్‌ఫోన్లో మాట్లాడిందని టీ.సీ ఇచ్చి పంపించేశారు స్కూల్ ప్రిన్సిపాల్. సత్యసాయి జిల్లా మడకశిరలోని మహాత్మా జ్యోతిబాపులే పాఠశాలలో వెలుగు చూసిందీ ఘటన. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
నార్పల మండల కేంద్రానికి చెందిన చాకలి నాగన్న కూతురు ప్రీతి సత్యసాయి జిల్లా మడకశిరలోని మహాత్మ జ్యోతిబాపులే పాఠశాలలో 10 తరగతి చదువుకుంటోంది. ప్రీతితో పాటు నార్పలకి చెందిన మరి కొంతమంది విద్యార్థులు కూడా అదే స్కూల్‌లో చదువుతున్నారు. ఊరి నుంచి వచ్చిన తోటి స్నేహితుల తల్లిదండ్రులు పాఠశాలకు కాగా, ప్రతీకి తన తండ్రి ఆరోగ్యం బాగోలేదని తెలియజేశారు. దాంతో కంగారుపడిన ప్రీతి.. వారి దగ్గర నుంచి సెల్ ఫోన్ తీసుకుని తండ్రికి ఫోన్ చేసింది. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంది. అయితే, విషయం తెలుసుకున్న స్కూల్ ప్రిన్సిపాల్.. ప్రీతి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాద్యాయుల అనుమతి తీసుకోకుండా సెల్ ఫోన్ మాట్లాడిందని ప్రీతికి టి.సి ఇచ్చి పంపించేశారు ప్రిన్సిపాల్. ప్రీతి, ఆమె కుటుంబ సభ్యులు ఎంత బ్రతిమాలినా వినలేదు. వారం రోజుల పాటు తరగతులకు అనుమతించలేదు. ఇటీవలే రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీలకు సెలెక్ట్ అయిన తనకు బాగా చదువు కోవాలని ఉందని, ఇలా స్కూల్ ప్రిన్సిపాల్ టి.సి ఇచ్చి మధ్యలోనే పంపించారని ఆవేదన వ్యక్తం చేస్తుంది.




మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..