- Telugu News Photo Gallery WhatsApp New feature users will get tips and tricks for privacy and security Know Details
WhatsApp New Feature: వాట్సాప్ నుంచి సరికొత్త ఫీచర్.. భద్రత విషయంలో ఇక టెన్షనే అవసరం ఉండదు..!
ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేసింగ్ యాప్ వాట్సాప్ మరో సరికొత్త సెక్యూరిటీ, ప్రైవసీ ఫీచర్‌ను తీసుకుంది. ఇది యూజర్లకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని వాట్సాప్ యాజమాన్య సంస్థ మెటా తెలిపింది. ఇందులో వినియోగదారులు అధికారిక చాట్‌లను ఆర్కైవ్ చేసుకోవచ్చు. లేదా బ్లాక్ చేయొచ్చు. ఈ చాట్ మాన్యువల్‌గా తెరవడం కష్టం. అంటే యాప్‌లో ఈ చాట్ ఫీచర్ కనిపించే వరకు వేచి ఉండాలన్నమాట.
Updated on: Jul 16, 2023 | 10:15 PM

Whatsapp New features

ఈ ఫీచర్‌ని కంపెనీ మార్చి నెలలో ప్రకటించగా.. ప్రస్తుతం బీటా యూజర్లకు అందుబాటులో ఉంది. అయితే, ఇదిది కొంతమంది యూజర్లను ఉద్దేశించి మాత్రమే విడుదల చేసింది.

ఆండ్రాయిడ్ 2.23.25.20 ఉన్న వాట్సాప్ బీటా యూజర్ల కోసం కంపెనీ ఈ అప్‌డేట్‌ను విడుదల చేసింది. WabetaInfo ప్రకారం.. యూజర్లు వాట్సాప్ అఫిషియల్ చాట్‌కు సంబంధించి యాప్‌లో లేటెస్ట్ అప్‌డేట్స్ అందుకుంటారు.

WabetaInfo వాట్సాప్ అధికారిక చాట్‌లో కొన్ని స్క్రీన్‌షాట్‌లను షేర్ చేసింది. ఈ చాట్‌లో, వినియోగదారులకు కొన్ని ట్రిక్స్‌తో పాటు ప్రైవసీ, సెక్యూరిటీ టిప్స్ పంచుకుంది. స్క్రీన్‌షాట్‌ను చూస్తే.. టూ ఫ్యాక్టర్ వేరిఫికేషన్ ఫీచర్ కూడా ఉంది.

ఈ ఫీచర్‌లో ఉన్న వెసులుబాటు ఏంటంటే.. వాట్సాప్ యూజర్లు అఫిషియల్ చాట్‌లను ఆర్కైవ్ చేయవచ్చు. అవసరమైతే బ్లాక్ కూడా చేయవచ్చు. ఈ చాట్ మాన్యువల్‌గా తెరవబడదు. అంటే యాప్‌లో ఈ చాట్ ఫీచర్ కనిపించే వరకు వేచి ఉండాల్సిందే.

వాట్సాప్ ఈ ఫీచర్ గురించి ప్రస్తుతం ఎటువంటి సమాచారాన్ని అధికారికంగా వెల్లడిచంలేదు. ఇది వినియోగదారులందరికీ అందుబాటులోకి రాదని నివేదికలు చెబుతున్నారు. అయితే, వాట్సాప్ బీటా 2.23.15.10ని అప్‌డేట్ చేసిన యూజర్లు అఫిషియల్ చాట్‌ను యూజ్ చేస్తున్నారు.





























