AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Donkey Marriage: గాడిదలకు ఘనంగా పెళ్లి, ఊరంతా ఊరేగింపు.. ఎందుకిలా చేశారంటే గ్రామస్తులు చెప్పిందిందే..!

వేసవి కాలం ముగిసింది.. వర్షాకాలం వచ్చేసింది.. వేసవిలో ఎండలు దంచికొట్టాయి.. కానీ, వర్షాకాలంలో వర్షాలు రావడం లేదు.. ఇప్పుడిదే పెద్ద సమస్యగా మారింది. ఇప్పటికీ మన దేశం, మన రాష్ట్రాల్లో వర్షాధారిత ప్రాంతాలే ఎక్కువ. చినుకు పడితే గానీ.. హలం కదలదు. కర్షకులకు పని ఉండదు. అందుకే.. వర్షాల కోసం...

Donkey Marriage: గాడిదలకు ఘనంగా పెళ్లి, ఊరంతా ఊరేగింపు.. ఎందుకిలా చేశారంటే గ్రామస్తులు చెప్పిందిందే..!
Donkey Marriage
Shiva Prajapati
| Edited By: TV9 Telugu|

Updated on: Jul 19, 2023 | 3:11 PM

Share

వేసవి కాలం ముగిసింది.. వర్షాకాలం వచ్చేసింది.. వేసవిలో ఎండలు దంచికొట్టాయి.. కానీ, వర్షాకాలంలో వర్షాలు రావడం లేదు.. ఇప్పుడిదే పెద్ద సమస్యగా మారింది. ఇప్పటికీ మన దేశం, మన రాష్ట్రాల్లో వర్షాధారిత ప్రాంతాలే ఎక్కువ. చినుకు పడితే గానీ.. హలం కదలదు. కర్షకులకు పని ఉండదు. అందుకే.. వర్షాల కోసం ధీనంగా ఆకాశంవైపు చూస్తున్నారు రైతన్నలు, ప్రజలు. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నప్పటికీ.. చాలా చోట్ల వర్షం జాడే కరువైంది. వర్షాలు కురవాలని వరుణ దేవుడికి ప్రార్థనలు చేస్తున్నారు జనాలు. అయితే, ఈ వర్షాల కోసం కొన్ని కొన్ని ప్రాంతాల్లో ప్రజలు వింత వింత క్రతువులు నిర్వహిస్తారు. కప్పలకు పెళ్లిళ్లు చెయ్యడం, చెట్లకు పెళ్లి చేయడం, జంతువులకు పెళ్లి చేయడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఇలాంటి ఆసక్తికర ఘటనే ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో వెలుగు చూసింది. ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఆచార సంప్రదాయాలు ఉన్నట్లుగానే.. అనంతపురంలోనూ వింత ఆచారాన్ని పాటిస్తున్నారు జనాలు.

ఊరిలో వర్షాలు కురవడం లేదని రెండు గాడిదలకు పెళ్లి చేశారు గ్రామస్తులు. ఈ వేడుకను ఊరు ఊరంతా కలిసి ఘనంగా నిర్వహించారు. అనంతపురం జిల్లా సెట్టూరు మండలంలోని చింతలపల్లి గ్రామంలో జరిగింది ఈ విచిత్ర వేడుక. రాళ్లు, చెట్లను దేవుళ్లుగా కొలిచినట్లుగానే.. వీరు గాడులకు వివాహం జరిపించి వర్షాలు కురవాలని ప్రార్థిస్తున్నారు.

చింతలపల్లి గ్రామంలో వర్షాల పడక.. అరక సాగని పరిస్థితి నెలకొంది. నేలంతా నెర్రెలుబారింది. దాంతో వర్షాల కోసం ప్రజలు వరుణుడిని ప్రార్థిస్తున్నారు. ఇందులో భాగంగా తమ విశ్వాసాల ప్రకారం.. గాడిదలకు పెళ్లి జరిపించారు. ఊరంతా కలిసి ఈ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించారు. గాడిలకు పెళ్లి చేస్తే వర్షం పడుతుందని వీరు గాఢంగా విశ్వసిస్తున్నారు. మబ్బులు దట్టంగా పడుతున్నప్పటికీ.. వర్షాలు రావడం లేదని గాడిదలకు పెళ్లి చేసి ఊరంతా ఊరిగేంచారు. అనంతరం చెరువు దగ్గరకు వెళ్లి.. అక్కడ కప్పలకు పెళ్లి చేశారు. ఇలా చేస్తే వరుణుడు కరిణించి వర్షం కురిపిస్తాడని రైతుల, ప్రజలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. పొలం దున్ని విత్తనాలు ఏసేందుకు సిద్ధమైన తరుణంలో వాన కురియకపోవడంతో గాడిదలకు పెళ్లి జరిపించాలని, ఇలా చేస్తే తప్పక వర్షం కురుస్తుందని గ్రామస్తులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ చేయండి..