AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Supreme Court: ‘వందే భారత్‌‌ను మా స్టేషన్‌లో ఆపండి’.. సుప్రీంకోర్టులో పిటిషన్.. రియాక్షన్ ఇదీ..!

రైళ్లు ఎక్కడ ఆగాలో కూడా మేం చెప్పాలా? అత్యున్నత న్యాయస్థానం పోస్టాఫీసులా కనిపిస్తోందా..? అంటూ పిటిషనర్‌ను నిలదీసింది సుప్రీంకోర్టు. వందే భారత్ రైలుకు తన సొంత జిల్లాలో స్టాప్ కేటాయించేలా రైల్వే శాఖను ఆదేశించాలంటూ ఓ న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.

Supreme Court: ‘వందే భారత్‌‌ను మా స్టేషన్‌లో ఆపండి’.. సుప్రీంకోర్టులో పిటిషన్.. రియాక్షన్ ఇదీ..!
Indian Railways: కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజలకు మెరుగైన రవాణా సేవలను అందించేందుకు సెమీహైస్పీడ్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అత్యాధునిక సౌకర్యాలతో ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ్చిన ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు పలు ప్రాంతాల మధ్య పరుగులు తీస్తున్నాయి. నిత్యం వేలాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి.
Shiva Prajapati
|

Updated on: Jul 18, 2023 | 9:59 AM

Share

రైళ్లు ఎక్కడ ఆగాలో కూడా మేం చెప్పాలా? అత్యున్నత న్యాయస్థానం పోస్టాఫీసులా కనిపిస్తోందా..? అంటూ పిటిషనర్‌ను నిలదీసింది సుప్రీంకోర్టు. వందే భారత్ రైలుకు తన సొంత జిల్లాలో స్టాప్ కేటాయించేలా రైల్వే శాఖను ఆదేశించాలంటూ ఓ న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. వందే భారత్ ట్రైన్‌ను కేరళలలోని తిరూరు స్టాపింగ్‌లో ఆపాలంటూ లాయర్ పీటీ శిజిష్ పిటిషన్ వేశారు. దీనిని విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసింది. రైళ్లకు ఎక్కడ స్టాపింగ్ ఇవ్వాలో తాము ఆదేశించలేమని వ్యాఖ్యానించింది. ట్రైన్స్ హాల్టింగ్ అంశంపై రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంటుందని, ఆయా స్టేషన్లలో ట్రైన్ ఆపాలని డిమాండ్ చేసే హక్కు ఎవరికి లేదని సుప్రీంకోర్టు వెల్లడించింది.

ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఓసారి పరిశీలిద్దాం. తిరూర్ రైల్వే స్టేషన్‌లో వందే భారత్ ట్రైన్ స్టాప్ కోసం తొలుత సౌత్ రైల్వేకు రిక్వెస్ట్ పెట్టారు. అక్కడి నుంచి రెస్పాండ్స్ రాకపోవడంతో.. కేరళ హైకోర్టును ఆశ్రయించారు. తిరూర్ రైల్వే స్టేషన్‌లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ను ఆపేలా ఆదేశించాలంటూ విజ్ఞప్తి చేశారు. రాజకీయ కారణాలతో తిరూర్‌లో స్టాప్ తొలగించారని పిటిషన్‌లో ఆరోపించారు. అయితే, ఈ పిటిషన్‌ను కేరళ హైకోర్టు కొట్టేసింది. దాంతో లాయర్ శీజిష్.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిని విచారణకు స్వీకరించిన సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం.. విచారణ చేపట్టేందుకు నిరాకరించింది. పిటిషన్‌ను కొట్టేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!