- Telugu News Photo Gallery Give up Caffeine for one month what will happen if you quit caffeine for a month body changes, Know Details
Give up Caffeine: ఒక నెల రోజులు కాఫీ, టీ తాగడం మానేయండి.. శరీరంలో వచ్చే మార్పు చూసి మీరే ఆశ్చర్యపోతారు..!
చాలామంది అనారోగ్యానికి ప్రధాన కారణం టీ, కాఫీ అని అంటారు. కెఫీన్ ఎక్కువగా తీసుకోవడం వలన ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుందని భావిస్తారు. అందుకే.. ఒక నెల రోజుల పాటు టీ, కాఫీలకు దూరంగా ఉంటే శరీరంలో చాలా మార్పులు జరుగుతాయని, ఆరోగ్యంగా ఉంటారని చెబుతున్నారు నిపుణులు. మరి మీరూ ట్రై చేస్తారా?
Updated on: Jul 16, 2023 | 9:56 PM

ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రజలు ఉదయం నిద్రలేవగానే కప్పు టీ లేదా కాఫీ మిస్సవ్వకుండా తాగుతారు. టీ, కాఫీతోనే తమ రోజును స్టార్ట్ చేస్తారు. ఈ హాట్ డ్రింక్ ను ఇష్టపడని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఎలాంటి పరిస్థితులోనైనా.. తక్షణ ఉపశమనం కోసం ఓ టీ గానీ, కాఫీ గానీ లాగించేస్తారు. ఇక ఒక రోజులో చాలాసార్లు టీ, కాఫీ తాగే వారు చాలా మందే ఉంటారు. ఎందుకిలా అంటే? ఇది మనస్సును, శరీరాన్ని రిఫ్రెష్ చేస్తుందని, త్వరగా శక్తిని ఇస్తుందని వారు చెబుతారు.

కానీ, వాస్తవం ఏంటంటే.. టీ, కాఫీ మన ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. ఇందులో ఉండే కెఫీన్.. అనారోగ్య సమస్యలకు కారణం అవుతుంది. అందుకే టీ, కాఫీ లను మానేయాలని సూచిస్తారు. కానీ, ఎవరూ తమ వల్ల కాదని అంటారు. కారణం.. చిన్నప్పటి నుంచే ఇది జీవితంలో భాగమైంది. అయితే, నెల రోజుల పాటు టీ, కాఫీలు మానేస్తే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పుడు అది తెలుసుకుందాం..

బ్లడ్ ప్రెజర్‌ను కంట్రోల్ చేస్తుంది: శరీరం అలసిపోయినప్పుడు టీ, కాఫీ తాగడం ద్వారా కాస్త ఉపశమనం లభిస్తుంది. కానీ, దీనిని అతిగా తాగడం వలన రక్తపోటు సమస్యను పెంచుతుంది. కారణం ఇందులో కెఫిన్ అనే పదార్థం ఉంటుంది. అందుకే ఒక నెల రోజుల పాటు టీ, కాఫీ తాగడం మానేస్తే రక్తపోటు అదుపులోకి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

కంటి నిండా నిద్ర: టీ, కాఫీ మానేయడం నిద్రపై మంచి ప్రభావం చూపుతుంది. టీ, కాఫీ తాగడం మానేస్తే ప్రశాంతమైన నిద్రను పొందే ఆస్కారం ఉంటుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

దంతాల ఆరోగ్యం: కెఫిన్ కలిగిన తేనీరు, కాఫీ వంటి వేడి వేడి డ్రింక్స్ దంతాలపై దుష్ప్రభావం చూపుతాయి. వీటిని తాగడం వల్ల దంతాల రంగు మారుతుంది. పైగా దంతాలు బలహీనమవుతాయి కూడా. అదే ఒక నెల రోజుల పాటు టీ, కాఫీ తాగడం మానేస్తే దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. భారీ నష్టం నుంచి బయటపడొచ్చు.





























