Social Media: సోషల్ మీడియాలో ప్రమోషన్ చేస్తున్నారా? జైలు శిక్ష, రూ 50 లక్షల జరిమానా తప్పదు! ఎందుకంటే..

Endorsement guidelines for social media influencers: ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ల హవా నడుస్తుందని చెప్పొచ్చు. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో లక్షలాది మంది ఫాలోవర్లతో మాంచి పాపులారిటీ కలిగి ఉన్నారు. బాలీవుడ్, స్పోర్ట్స్ సెలబ్రిటీల వలె, వీరు కూడా తమ అనుచరులను ప్రభావితం చేస్తుంటారు.

Social Media: సోషల్ మీడియాలో ప్రమోషన్ చేస్తున్నారా? జైలు శిక్ష, రూ 50 లక్షల జరిమానా తప్పదు! ఎందుకంటే..
Representative Image
Follow us

|

Updated on: Jul 16, 2023 | 7:20 PM

Endorsement guidelines for social media Influencers: ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ల హవా నడుస్తుందని చెప్పొచ్చు. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో లక్షలాది మంది ఫాలోవర్లతో మాంచి పాపులారిటీ కలిగి ఉన్నారు. బాలీవుడ్, స్పోర్ట్స్ సెలబ్రిటీల వలె, వీరు కూడా తమ అనుచరులను ప్రభావితం చేస్తుంటారు. అందుకే చాలా కంపెనీలు, బ్రాండ్‌లు ఇన్‌ఫ్లుయెన్సర్‌లతో ఒప్పందం చేసుకుని తమ ఉత్పత్తుల గురించి ప్రచారం చేస్తాయి. ఇందుకు ప్రతిగా ఇన్‌ఫ్లుయెన్సర్లు కూడా గణనీయమైన ఆదాయాన్ని పొందుతున్నారు. అయితే, చాలా మంది తెలిసి తెలియక మోసపూరితమైన, నకిలీ ఉత్పత్తులు, సేవల గురించి ప్రచారం చేస్తుంటారు. ఇది వారిని మరింత ఇబ్బందుల్లో నెట్టే ప్రమాదం ఉంది. మీరు కూడా సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ అయినట్లయితే.. ప్రోడక్ట్స్‌కి ప్రచారం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

తాజాగా ముంబైలో ఇందుకు నిదర్శనమైన ఓ ఉదంతం వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఒకరు మోసపూరితమైన పెట్టుబడి పథకాన్ని ప్రోత్సహిస్తూ ప్రచారం చేశారు. అందులో పెట్టుబడి పెట్టాల్సిందిగా ప్రచారం చేశారు. ఇందులో పెట్టుబడి పెట్టడం ద్వారా కేవలం 30-35 నిమిషాల్లో డబ్బు రెట్టింపు అవుతుందని పేర్కొన్నారు. ‘క్రిప్టో_అనైషా’ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి ఈ ఫోర్జరీ జరుగుతోంది. రూ.999 పథకంపై చాలా మంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు ప్రచారం చేశారు.

నిందితులతో పాటు.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల అరెస్ట్..

ఈ కేసులో ప్రధాన నిందితుడు మహ్మద్ హంజా జాకీ అన్వర్‌ను పోలీసులు అరెస్ట్ చేయగా.. క్రిప్టో స్కీమ్‌ను ఎంకరేజ్ చేసిన ముగ్గురు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు మాన్సీ సురవసే, అక్షయ్ ఆత్రే, అంకితా భగత్‌లపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇన్‌స్టాగ్రామ్‌లో వీరికి మిలియన్లలో ఫాలోవర్స్ ఉన్నారు. వీరి ప్రకటనను చూసి చాలా మంది ట్రాప్‌లో పడ్డారు. డబ్బు ఇన్వెస్ట్ చేయగా.. చివరకు సదరు వ్యక్తి మోసానికి పాల్పడ్డాడు. దాంతో బాధితులు పోలీసులను ఆశ్రయించగా.. రంగంలోకి దిగిన ఖాకీలు నిందితుడు సహా, ఈ స్కీమ్‌కు ప్రచారం చేసిన ఇన్‌ఫ్లుయెన్సర్లపై చర్యలు తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి

ప్రభావితం చేసేవారి కోసం మార్గదర్శకాలు..

మీరు కూడా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అయితే, ఇలాంటి తప్పుదోవ పట్టించే ప్రకటనల పట్ల జాగ్రత్తగా ఉండాలి. లేదంటే.. భారీ జరిమానా విధించే అవకాశం ఉంది. అంతేకాదు.. ప్రకటనలు, ప్రమోషన్స్ చేయకుండా నిషేధానికి గురయ్యే అవకాశం ఉంది. సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లుయెన్సర్‌ల కోసం ప్రభుత్వం ఈ ఏడాది కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. దీని ప్రకారం.. ఇన్‌ఫ్లుయెన్సర్‌లు చట్టవిరుద్ధమైన ఎలాంటి యాడ్స్‌, ప్రమోషన్‌లు చేయకూడదని అందులో పేర్కొనడం జరిగింది.

50 లక్షల వరకు జరిమానా..

యూజర్ల రక్షణ చట్టం క్రింద “ఎండార్స్‌మెంట్స్ నో-హౌస్!” జారీ చేసింది. సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లుయెన్సర్‌లు ఏదైనా ఉత్పత్తిని ప్రమోట్ చేస్తున్నప్పుడు ప్రజలను తప్పుదోవ పట్టించరాదని మార్గదర్శకాల్లో స్పష్టంగా పేర్కొన్నారు. ఎవరైనా ఇలా చేస్తే రూ. 10 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు జరిమానా విధించవచ్చు. ఇది కాకుండా, 1 నుంచి 3 సంవత్సరాల వరకు ప్రమోషన్ లేదా ప్రకటనలపై నిషేధం విధించొచ్చు.

మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..